బ్రిస్బేన్: ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెటర్లను గాయాలు వెంటాడుతున్నాయి. డ్రాగా ముగిసిన సిడ్నీ టెస్టులోనైతే ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు గాయపడ్డారు. టీమిండియాలో ఇంతమంది గాయాల గేయాలు ఆలపించడానికి ఐపీఎల్లే కారణమని అంటున్నాడు ఆస్ట్రేలియా జట్టు చీఫ్ కోచ్ జస్టిన్ లాంగర్. యువ క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చే ఐపీఎల్ అంటే తనకెంతో ఇష్టమనీ.. అయితే, ఈసారి లీగ్ నిర్వహించిన సమయమే సరైంది కాదని లాంగర్ అభిప్రాయపడ్డాడు. ఆసీ్‌సలాంటి సుదీర్ఘమైన సిరీ్‌సకు ముందు లీగ్ జరపాలన్న ఆలోచనే సరైంది కాదు. ఆ ప్రభావం ఇప్పుడు సిరీ్‌సలో ఆటగాళ్లపై చూపుతోంది. భవిష్యత్‌లోనైనా ఇలాంటి పొరపాట్లు దొర్లకుండా లీగ్ నిర్వాహకులు చూసుకుంటారని అనుకుంటున్నా’ అని లాంగర్ అభిప్రాయపడ్డాడు.