ఆగస్టు 15న అగ్రరాజ్యంలో ఎగరనున్న అతిపెద్ద త్రివర్ణ పతాకం!

ABN , First Publish Date - 2021-08-12T20:35:45+05:30 IST

భారత స్వాతంత్ర్య దినోత్సవం 75వ వార్షికోత్సవం సందర్భంగా అగ్రరాజ్యం అమెరికాలోని ప్రముఖ భారతీయ ప్రవాస సంస్థ ఆగస్టు 15న న్యూయార్క్‌లోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్‌లో అతిపెద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేసింది.

ఆగస్టు 15న అగ్రరాజ్యంలో ఎగరనున్న అతిపెద్ద త్రివర్ణ పతాకం!
ప్రతీకాత్మక చిత్రం

న్యూయార్క్: భారత స్వాతంత్ర్య దినోత్సవం 75వ వార్షికోత్సవం సందర్భంగా అగ్రరాజ్యం అమెరికాలోని ప్రముఖ భారతీయ ప్రవాస సంస్థ ఆగస్టు 15న న్యూయార్క్‌లోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్‌లో అతిపెద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్(ఎఫ్ఐఏ)- న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ ఆగస్టు 15న టైమ్ స్క్వేర్ వద్ద ఆరు అడుగుల పొడువు, పది అడుగుల వెడల్పు ఉన్న పతాకాన్ని 25 అడుగుల ఎత్తు ఉన్న జెండా కర్రపై ఎగురవేయనుంది. న్యూయార్క్‌లోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా రంధీర్ జైస్వాల్ జెండాను ఎగురవేయనున్నారు. అలాగే ప్రఖ్యాత బిల్‌బోర్డుపై కూడా ఆ రోజు 24 గంటల పాటు త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించనున్నారు. అంతేగాక ప్రముఖ ఎంపైర్ స్టేట్ భవనం జాతీయ జెండాలోని మూడు రంగులతో మెరిసిపోనుంది. ఎఫ్ఐఏ ఛైర్మన్ అంకుర్ వైద్య మాట్లాడుతూ.. ప్రతియేటా టైమ్ స్కేర్ వద్ద త్రివర్ణ పతాక ఆవిష్కరణ జరుగుతుంది. కానీ, ఈ ఏడాది 75వ వార్షికోత్సవం సందర్భంగా ఇలా ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 

Updated Date - 2021-08-12T20:35:45+05:30 IST