ఐరాస అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌గా భారత ఆర్థికవేత్త

ABN , First Publish Date - 2021-02-27T13:28:31+05:30 IST

న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమ (యూఎన్‌ఈపీ) కార్యాలయ చీఫ్‌, అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌గా భారత ఆర్థికవేత్త లిగియా నొరొన్హాను ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ నియమించారు.

ఐరాస అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌గా భారత ఆర్థికవేత్త

ఐక్యరాజ్యసమితి, ఫిబ్రవరి 26: న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమ (యూఎన్‌ఈపీ) కార్యాలయ చీఫ్‌, అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌గా భారత ఆర్థికవేత్త లిగియా నొరొన్హాను ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ నియమించారు. ఇప్పటివరకు ఆ స్థానంలో భారత ఆర్థికవేత్త సత్య త్రిపాఠి ఉన్నారు. ఆ బాధ్యతల్లో సత్య త్రిపాఠి పూర్తి నిబద్ధతతో పని చేశారని ఆంటోనియో గుటెరస్‌ ప్రశంసించారు. కాగా, ప్రపంచ సుస్థిర అభివృద్ధి కోసం 30 ఏళ్లుగా నొరొన్హా పని చేస్తున్నారు. యూఎన్‌ఈపీ ఆర్థిక శాఖతో పాటు వాతావరణ, ఆరోగ్య, కాలుష్య నియంత్రణ వంటి అనేక విభాగాల్లోనూ వివిధ హోదాల్లో ఆమె పని చేశారు.

Updated Date - 2021-02-27T13:28:31+05:30 IST