రికవరీకి చేరువలో ఆర్థిక వ్యవస్థ

ABN , First Publish Date - 2020-10-22T06:55:14+05:30 IST

కొవిడ్‌ కష్టాల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ చాలా వరకు బయట పడిందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. ప్రస్తుతం రికవరీకి అత్యంత చేరువలో ఉందన్నారు...

రికవరీకి చేరువలో ఆర్థిక వ్యవస్థ

న్యూఢిల్లీ : కొవిడ్‌ కష్టాల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ చాలా వరకు బయట పడిందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. ప్రస్తుతం రికవరీకి అత్యంత చేరువలో ఉందన్నారు. 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎస్‌కే సింగ్‌ రాసిన ఒక పుస్తక ఆవిష్కరణ సభలో దాస్‌ మాట్లాడుతూ కొవిడ్‌ సవాళ్లను ఎదుర్కొనేందుకు ద్రవ్యలోటు లక్ష్యాన్ని పక్కన పెట్టి, మరిన్ని నిధులు ఖర్చు చేయక తప్పలేదన్నారు. కొవిడ్‌ పూర్తిగా అదుపులోకి వచ్చాక ప్రభుత్వం విత్త విధాన లక్ష్యాలను ప్రకటిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఆర్‌బీఐ, ప్రభుత్వం తీసుకున్న ద్రవ్య, ఆర్థిక చర్యలు రికవరీకి బాగా దోహదం చేశాయన్నారు. కొన్ని సంస్థలు ఇప్పటికే నిధులు సమకూర్చుకున్న విషయాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌ గుర్తు చేశారు. మిగతా సంస్థలూ వచ్చే కొద్ది నెలల్లో నిధులు సమకూర్చుకుంటాయన్నారు.

Updated Date - 2020-10-22T06:55:14+05:30 IST