పీసీసీ విషయంలో ప్రవాసులకు భారత ఎంబసీ కీలక సూచన!

ABN , First Publish Date - 2021-08-13T16:15:52+05:30 IST

పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్(పీసీసీ) విషయమై యూఏఈలో ఉంటున్న భారతీయులకు అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ తాజాగా కీలక సూచన చేసింది.

పీసీసీ విషయంలో ప్రవాసులకు భారత ఎంబసీ కీలక సూచన!

అబుధాబి: పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్(పీసీసీ) విషయమై యూఏఈలో ఉంటున్న భారతీయులకు అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ తాజాగా కీలక సూచన చేసింది. ఇకపై పీసీసీ అవసరమున్న ప్రవాసులు స్థానిక పోలీసుల అనుమతి లేకుండా దీన్ని నేరుగా పొందవచ్చని తెలియజేసింది. బీఎల్ఎస్ ఇంటర్నెషనల్ ద్వారా నేరుగా తీసుకోవచ్చని తెలియజేసింది. ఇక భారత ప్రభుత్వం జారీచేసే పీసీసీని విదేశాల్లో వర్క్, స్టడీ, ఇమ్మిగ్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర ధృవపత్రాలను పొందేందుకు చాలా అవసరం.


ఈ నేపథ్యంలో తాజాగా అబుధాబిలోని భారత ఎంబసీ ప్రవాసులకు పీసీసీ పొందేందుకు యూఏఈ పీసీసీ అవసరంలేదని, నేరుగా బీఎల్ఎస్ ఇంటర్నెషనల్ ద్వారా తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇక బీఎల్ఎస్ ఇంటర్నెషనల్ కేంద్రాల్లో ప్రవాసుల వీసా, పాస్‌పోర్ట్ దరఖాస్తులు ప్రాసెస్ అవుతాయనే విషయం తెలిసిందే. ఇప్పుడు పీసీసీ కూడా ఇక్కడి నుంచే పొందే అవకాశం కల్పిస్తున్నట్లు ఎంబసీ వెల్లడించింది. అల్ రీమా ఐస్‌ల్యాండ్‌లోని షమాస్ బౌటిక్ మాల్, ముసాఫ్పాలోని పారిశ్రామిక వాడలో బీఎల్ఎస్ కేంద్రాలు ఉన్నాయి.    

Updated Date - 2021-08-13T16:15:52+05:30 IST