బహ్రెయిన్‌లోని ప్రవాసులకు భారత రాయబారి సూచనలు

ABN , First Publish Date - 2021-08-02T16:23:18+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో బహ్రెయిన్‌లోని ఇండియన్ కమ్యూనిటీకి ఆ దేశంలోని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ కీలక సూచనలు చేశారు. బహ్రెయిన్‌లో అమలవుతున్న కరోనా నిబంధనలను

బహ్రెయిన్‌లోని ప్రవాసులకు భారత రాయబారి సూచనలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో బహ్రెయిన్‌లోని ఇండియన్ కమ్యూనిటీకి ఆ దేశంలోని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ కీలక సూచనలు చేశారు. బహ్రెయిన్‌లో అమలవుతున్న కరోనా నిబంధనలను పాటిస్తూ, మహమ్మారికి వ్యతిరేకంగా బహ్రెయిన్ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని సూచించారు. వర్చువల్ విధానంలో జరిగిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇండియన్ కమ్యూనిటీ సభ్యులందరినీ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరారు. వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్‌లో ఇబ్బందులు ఎదురైతే.. ఎంబసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన లింక్ ద్వారా టీకా స్లాట్‌ను బుక్ చేసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా సాధరణ, అత్యవసర కాన్సులర్ సేవలపై ఇండియన్ కమ్యూనిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. లేబర్ సమస్యలను సైతం ప్రస్తావించారు. 



ఇదిలా ఉంటే.. భారత ప్రభుత్వం వ్యాక్సిన్ తీసుకున్న ప్రవాసులకు క్యూఆర్ కోడ్, పాస్‌పోర్ట్ నెంబర్‌తో కూడిన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌లను అందిస్తున్నట్టు చెప్పారు. ప్రయాణ సమయంలో సమస్యలు ఎదురు కాకుండా ఈ సర్టిఫికెట్లు ఉపయోగపడుతున్నాయని ఆయన వివరించారు. దీంతోపాటు ఇండియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను సంక్షిప్తంగా ప్రవాసులకు తెలియజేశారు. కాగా.. ఈ కార్యక్రమంలో బహ్రెయిన్ నలుమూలల నుంచి వందలాది మంది ప్రవాసులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-02T16:23:18+05:30 IST