Indian Embassy ఆధ్వర్యంలో Kuwait లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు..

ABN , First Publish Date - 2021-10-03T15:07:44+05:30 IST

కువైత్‌లోని భారత రాయబార కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

Indian Embassy ఆధ్వర్యంలో Kuwait లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు..

కువైత్ సిటీ: కువైత్‌లోని భారత రాయబార కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మొదట ఎంబసీలోని గాంధీ విగ్రహానికి రాయబారి సిబి జార్జ్ పుష్పాగుచ్ఛాలతో నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ జయంతి సందర్భంగా ఎంబసీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కార్యక్రమానికి హాజరైన ప్రవాస సంఘాల ప్రతినిధులకు రాయబారి ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. గాంధీ చూపిన సత్యం, ధర్మం, అహింసా మార్గాలు ఎప్పటికీ ఆచరణీయమని ఆయన పేర్కొన్నారు. మహాత్మా గాంధీ వసుదైవ కుటుంబకం స్ఫూర్తితో భారత్ ఇవాళ ప్రపంచ దేశాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందిందని ఈ సందర్భంగా రాయబారి గుర్తు చేశారు. 


ఈ వేడుకలో కువైత్ కళాకారుడు ముబారక్ అల్ రాషెడ్, యూరోపియన్ కళాకారులు పాడిన ‘వైష్ణవ్ జన్ తు తేనే కహియే’ పాట వీడియోలను ప్రదర్శించారు. అనంతరం ఆగస్టు 13న నిర్వహించిన ప్రసంగ పోటీలకు సంబంధించిన అంబాసిడర్ కప్ ట్రోఫీలను విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరు స్థానిక భారతీయ కళాకారులు శివశంకర్ నారాయణ్, శ్రీ రామచంద్ర భారత రాయబారికి మహాత్మా గాంధీ చిత్రపటాన్ని అందజేశారు.

Updated Date - 2021-10-03T15:07:44+05:30 IST