వందే భార‌త్ మిష‌న్: ఒమ‌న్ నుంచి భార‌త్ రానున్న విమానాల షెడ్యూల్ ఇదే !

ABN , First Publish Date - 2020-08-11T18:40:07+05:30 IST

'వందే భార‌త్ మిష‌న్' ఐదో ద‌శ‌లో భాగంగా ఒమ‌న్ నుంచి భార‌త్‌కు న‌డ‌ప‌నున్న విమాన స‌ర్వీసుల షెడ్యూల్‌ను తాజాగా ఇండియ‌న్ ఎంబ‌సీ ప్ర‌క‌టించింది.

వందే భార‌త్ మిష‌న్: ఒమ‌న్ నుంచి భార‌త్ రానున్న విమానాల షెడ్యూల్ ఇదే !

మ‌స్క‌ట్: 'వందే భార‌త్ మిష‌న్' ఐదో ద‌శ‌లో భాగంగా ఒమ‌న్ నుంచి భార‌త్‌కు న‌డ‌ప‌నున్న విమాన స‌ర్వీసుల షెడ్యూల్‌ను తాజాగా ఇండియ‌న్ ఎంబ‌సీ ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 16-31 తేదీల మ‌ధ్య‌ మ‌స్క‌ట్ నుంచి భార‌తదేశంలోని వివిధ న‌గ‌రాల‌కు ఈ విమానాలు ప్ర‌వాసుల‌ను తీసుకురానున్నాయి. ఒమ‌న్‌లోని భార‌త రాయ‌బార కార్యాల‌యం ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం....

ఆగ‌స్టు 16న గోవా, ముంబై‌(ఒకే విమాన స‌ర్వీసు)

ఆగ‌స్టు 17, 31 తేదీల్లో ‌తిరుచిరాపల్లి, కాలికట్ 

ఆగస్టు 18, 25 తేదీల్లో లక్నో, చెన్నై

ఆగస్టు 20, 27 తేదీల్లో కన్నూర్

ఆగస్టు 21, 29 తేదీల్లో ముంబై

ఆగస్టు 22, 30 తేదీల్లో కొచ్చి 

ఆగస్టు 22, 28 తేదీల్లో త్రివేండ్రం

ఆగస్టు 23, 31 తేదీల్లో ఢిల్లీ

ఆగస్టు 24 ,31 తేదీలలో బెంగళూరు, మంగుళూరు (ఒకే విమాన స‌ర్వీసు)

ఆగస్టు 25న హైదరాబాద్

ఆగస్టు 26న విజయవాడ


ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం సెకండ్ సెక్రెట‌రీ అనుజ్ స్వరూప్... "ఒమ‌న్ అథారిటీస్ స‌హ‌కారంతోనే వందే భార‌త్ మిష‌న్ ఐదో ద‌శ విమాన స‌ర్వీసులు ఇప్ప‌టివ‌ర‌కు షెడ్యూల్ ప్ర‌కారం అనుకున్న స‌మ‌యానికి బ‌య‌ల్దేరాయి. వారి అద్భుతమైన సహకారానికి కృతజ్ఞతలు తెలియ‌జేస్తున్నాం. ఆగస్టు 9 వరకు వందే భార‌త్ మిష‌న్ 5వ దశ కింద ఆరు విమానాలు ఒమన్ నుండి భారతదేశానికి వెళ్లాయి. వీటిలో మొత్తం 917 మంది ప్రయాణికులు స్వ‌దేశానికి వెళ్లారు." అని అన్నారు. కాగా, సోమ‌వారం నాటికి(ఆగ‌స్టు 10) 'వందే భార‌త్ మిష‌న్' కింద వివిధ దేశాల నుంచి సుమారు 10 లక్ష‌ల మంది స్వ‌దేశానికి చేరుకుంటే... ల‌క్ష 30వేల మంది ప్ర‌వాసులు విదేశాల‌కు వెళ్లార‌ని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్ల‌డించారు.    

Updated Date - 2020-08-11T18:40:07+05:30 IST