ఈ-వీసాల రిజిస్ట్రేషన్‌పై భారత ఎంబసీ కీలక ప్రకటన!

ABN , First Publish Date - 2021-04-13T15:02:52+05:30 IST

ఈ-వీసాల రిజిస్ట్రేషన్ ‌విషయమై ఒమన్‌లోని భారత ఎంబసీ కీలక ప్రకటన చేసింది.

ఈ-వీసాల రిజిస్ట్రేషన్‌పై భారత ఎంబసీ కీలక ప్రకటన!

మస్కట్: ఈ-వీసాల రిజిస్ట్రేషన్ ‌విషయమై ఒమన్‌లోని భారత ఎంబసీ కీలక ప్రకటన చేసింది. ఈ-టూరిస్ట్ వీసా కాకుండా ఇతర సబ్-కేటగిరీల కింద ఎలక్ట్రానిక్ వీసా (ఈ-వీసా) పునరుద్ధరణ గురించి ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ-బిజినెస్ వీసా, ఈ-మెడికల్ వీసా, ఈ-మెడికల్ అటెండెంట్ వీసా, ఈ-కాన్ఫరెన్స్ తదిరత సబ్-కేటగిరీల ఈ-వీసాలను తక్షణమే పొందే వెసులుబాటు కల్పించినట్లు తన ట్వీట్‌లో పేర్కొంది. ఇక పైన పేర్కొన్న కేటగిరీలో ఈ-వీసాకు అర్హత ఉన్న దేశాలలో ఒమన్ కూడా ఉంది. ఈ వీసాల కోసం రిజిస్ట్రేషన్ తప్పనిసరి. దీనికోసం పాస్‌పోర్టు, వీసా, నాలుగు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు అవసరం అవుతాయని ఎంబసీ తెలిపింది. 16 ఏళ్లలోపు పిల్లలకు రిజిస్ట్రేషన్ అవసరం లేదని ఎంబసీ అధికారులు వెల్లడించారు. 



Updated Date - 2021-04-13T15:02:52+05:30 IST