వీబీఎం ఏడో విడత: ఒమన్ నుంచి భారత్ వచ్చే విమాన సర్వీలు ఇవే

ABN , First Publish Date - 2020-09-27T13:39:01+05:30 IST

ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం వందే భారత్ మిషన్(వీబీఎం) ఏడో విడతలో ఇండియాకు వచ్చే విమాన సర్వీసుల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది.

వీబీఎం ఏడో విడత: ఒమన్ నుంచి భారత్ వచ్చే విమాన సర్వీలు ఇవే

మస్కట్: ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం వందే భారత్ మిషన్(వీబీఎం) ఏడో విడతలో ఇండియాకు వచ్చే విమాన సర్వీసుల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఒమన్ నుంచి భారత్‌లోని వివిధ గమ్యస్థానాలకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు అక్టోబర్ 17 వరకు వస్తాయని ఎంబసీ పేర్కొంది. ప్రధానంగా మస్కట్, సలాహ్ నగరం నుంచి ఈ సర్వీసులు నడవనున్నాయి. కనుక ఈ షెడ్యూల్‌ను అనుసరించి స్వదేశానికి వెళ్లాలనుకునే భారత ప్రవాసులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఇండియన్ ఎంబసీ తెలియజేసింది. 


షెడ్యూల్ పూర్తి వివరాలు  

మస్కట్ టు ఢిల్లీ: అక్టోబర్ 1, 3, 4, 8, 10, 11, 15, 17. అయితే 3, 10, 17 తేదీల్లో ఢిల్లీకి వచ్చే విమనాలు లక్నోకు కూడా వెళ్తాయి. 


మస్కట్ టు ముంబై: అక్టోబర్ 2, 7, 9, 14, 16. అలాగే అక్టోబర్ 8న సలాహ్ నగరం నుంచి కన్నూర్, ముంబైకి ఒక విమానం సర్వీస్ ఉంది. 


మస్కట్ టు కొచ్చి: అక్టోబర్ 2, 4, 9, 11, 16. కాగా, సలాహ్ నగరం నుంచి అక్టోబర్ 1, 15 తేదీల్లో కొచ్చి(వయా కన్నూర్) రెండు విమాన సర్వీలు నడవనున్నాయి. 


మస్కట్ టు త్రివేండ్రం: అక్టోబర్ 1, 4, 8, 11, 15.


మస్కట్ టు కన్నూర్: 3, 6, 10, 13, 17. అలాగే అక్టోబర్ 1,8,15 తేదీల్లో మస్కట్ నుంచి బెంగళూరు / మంగుళూరుకు విమాన సర్వీసులు ఉన్నాయి. 


మస్కట్ టు విజయవాడ / హైదరాబాద్(సింగిల్ ఫ్లైట్): అక్టోబర్ 4,8.


మస్కట్ టు తిరుచిరాపల్లి: అక్టోబర్ 7, 14.

Updated Date - 2020-09-27T13:39:01+05:30 IST