కొలంబోలో గంగరామయ దేవాలయంలో భారత దౌత్యవేత్త గోపాల్ బాగ్లే పూజలు

ABN , First Publish Date - 2020-05-23T20:46:00+05:30 IST

శ్రీలంకలో భారత హై కమిషనర్‌గా కొత్తగా నియమితులైన గోపాల్ బాగ్లే కొలంబోలో

కొలంబోలో గంగరామయ దేవాలయంలో భారత దౌత్యవేత్త గోపాల్ బాగ్లే పూజలు

కొలంబో : శ్రీలంకలో భారత హై కమిషనర్‌గా కొత్తగా నియమితులైన గోపాల్ బాగ్లే కొలంబోలో గంగరామయ దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సెయింట్ ఆంథోని చర్చ్‌‌లో ప్రార్థనలు చేశారు.


గోపాల్ బాగ్లే మాట్లాడుతూ భారత దేశం, శ్రీలంక ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలని బుద్ధ భగవానుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఇరు దేశాల ప్రజలకు ఆరోగ్యం, శాంతి, సంపద లభించాలని కోరుకున్నట్లు తెలిపారు.  ఇరు దేశాలు స్నేహంగా, పరస్పర సహకారంతో మెలగాలని కోరుకున్నట్లు తెలిపారు.  శ్రీలంకతో అన్ని రంగాల్లోనూ సహకారం పెంపొదించుకోవాలని భారత ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. భారత్-శ్రీలంక ప్రజల మధ్య  సంబంధాలు బతోపేతం కావాలని కోరుకుంటున్ట్లు తెలిపారు.


గోపాల్ బాగ్లే ఈ నెల 8న ప్రత్యేక విమానంలో శ్రీలంక చేరుకున్నారు. భారత దేశం నుంచి బహుమతిగా కొన్ని మందులు, ఇతర వస్తువులను తీసుకెళ్ళి శ్రీలంక ప్రభుత్వానికి అప్పగించారు. 


ఈ నెల 8న శ్రీలంక చేరుకున్న వెంటనే ఆయన ఆరోగ్య సంబంధిత నిబంధనలను పాటించారు. అప్పటి నుంచి ఆయన బహిరంగ ప్రదేశంలోకి రావడం ఇదే మొదటిసారి.


Updated Date - 2020-05-23T20:46:00+05:30 IST