దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో భార‌తీయుడికి జాక్‌పాట్‌!

ABN , First Publish Date - 2021-06-17T18:30:56+05:30 IST

దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో భార‌తీయుడికి జాక్‌పాట్ త‌గిలింది. భార‌త సంత‌తి వ్యాపారవేత్త అబ్రహాం జాయీ(60) దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో 1మిలియ‌న్ డాల‌ర్లు(రూ. 7.38కోట్లు) గెలుచుకున్నాడు. దీంతో అబ్రహాం రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడ‌య్యాడు.

దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో భార‌తీయుడికి జాక్‌పాట్‌!

దుబాయ్‌: దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో భార‌తీయుడికి జాక్‌పాట్ త‌గిలింది. భార‌త సంత‌తి వ్యాపారవేత్త అబ్రహాం జాయీ(60) దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో 1మిలియ‌న్ డాల‌ర్లు(రూ. 7.38కోట్లు) గెలుచుకున్నాడు. దీంతో అబ్రహాం రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడ‌య్యాడు. మే 27న ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్ నెం. 1,031కు ఈ ల‌క్కీ లాట‌రీ త‌గిలింది. 35 ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటున్న ఆయ‌న‌ గ‌త 15 ఏళ్లుగా ఈ లాట‌రీ టికెట్లు కొంటున్న‌ట్లు తెలిపారు. 15 ఏళ్ల త‌ర్వాత  చివ‌ర‌కు త‌నకు ల‌క్కు క‌లిసొచ్చింద‌ని, దీంతో ఈ భారీ మొత్తం గెలుచుకున్న‌ట్లు ఆనందం వ్య‌క్తం చేశారు. తాను గెలుచుకున్న ఈ భారీ మొత్తంలో సింహ‌భాగం త‌న వ్యాపారంలో పెట్టుబ‌డిగా పెడ‌తాన‌ని, కొంత మొత్తం సేవా కార్యక్ర‌మాల‌కు వినియోగిస్తాన‌ని అబ్ర‌హాం చెప్పుకొచ్చారు.


కేర‌ళ రాష్ట్రానికి చెందిన అబ్ర‌హాంకు భార్య, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అలాగే ఇదే రాఫెల్ డ్రాలో మ‌రో భార‌తీయుడు విలువైన మోట‌ర్‌ బైక్‌ను సొంతం చేసుకున్నాడు. దుబాయ్‌లో ఉండే సంజ‌య్ అస్నాని(30).. ఆప్రిలియా ఆర్ఎస్‌వీ4 ఫ్యాక్ట‌రీ(Atomico Racer) మోట‌ర్‌ బైక్ గెలుచుకున్నాడు. ఇక‌ 1999లో ప్రారంభ‌మైన దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ 1 మిలియ‌న్ డాల‌ర్లు గెలుచుకున్న భార‌తీయుల్లో అబ్ర‌హాం 180వ వ్య‌క్తి. కాగా, ఈ డ్యూటీ ఫ్రీ రాఫెల్ టికెట్ల కొనుగోలుదారుల్లో ఎక్కువ మంది భార‌తీయులేన‌ని లాట‌రీ నిర్వాహ‌కులు తెలియ‌జేశారు.   

Updated Date - 2021-06-17T18:30:56+05:30 IST