Dubai Duty Free raffle: భారతీయుడికి జాక్‌పాట్!

ABN , First Publish Date - 2021-08-12T14:23:21+05:30 IST

భారత్‌కు చెందిన 57ఏళ్ల వ్యక్తికి అదృష్టం తలుపుతట్టింది. దీంతో రాత్రికి రాత్రే.. మిలియనీర్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఇండియాకు చెందిన సాబు అలమిట్టత్ (57).. కొన్నేళ్లుగా దుబాయి ఎయిర్‌పోర్ట్స్‌లో

Dubai Duty Free raffle: భారతీయుడికి జాక్‌పాట్!

అబుధాబి: భారత్‌కు చెందిన 57ఏళ్ల వ్యక్తికి అదృష్టం తలుపుతట్టింది. దీంతో రాత్రికి రాత్రే.. మిలియనీర్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఇండియాకు చెందిన సాబు అలమిట్టత్ (57).. కొన్నేళ్లుగా దుబాయి ఎయిర్‌పోర్ట్స్‌లో ట్రాఫిక్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత ఐదేళ్లుగా లాటరీ టికెట్ కొనుగోలు చేస్తూ దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ సిరీస్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు జాక్‌పాట్ తగిలింది. తాజాగా తీసిన డ్రాలో సాబు అలమిట్టత్.. 1 మిలియన్ డాలర్లు (సుమారు రూ.7.42కోట్లు) గెలుచుకున్నారు. ఈ తనకు డ్రాలో జాక్‌పాట్ తగిలిందని తెలిసి.. సాబు అలమిట్టత్ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాను గెలుపొందిన డబ్బులో కొంత మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. 


Updated Date - 2021-08-12T14:23:21+05:30 IST