కొత్త ఏడాది ఈ ఎన్నారైకి మాములుగా కలిసి రాలేదుగా.. రాత్రికి రాత్రే ఖాతాలోకి రూ.2కోట్లు!

ABN , First Publish Date - 2022-01-02T17:20:22+05:30 IST

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఉండే ఎన్నారైకి కొత్త ఏడాది బాగా కలిసొచ్చింది.

కొత్త ఏడాది ఈ ఎన్నారైకి మాములుగా కలిసి రాలేదుగా.. రాత్రికి రాత్రే ఖాతాలోకి రూ.2కోట్లు!

రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఉండే ఎన్నారైకి కొత్త ఏడాది బాగా కలిసొచ్చింది. ఎంతలా అంటే రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసేసింది. 2022 జనవరి 1న నిర్వహించిన అబుధాబి బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో వేఖర్ జఫ్రీ అనే భారత ప్రవాసుడు ఏకంగా 1 మిలియన్ దిర్హమ్స్(రూ.2.21కోట్లు) గెలుచుకున్నారు. ఇంతకుముందు జఫ్రీ పలుమార్లు బిగ్ టికెట్ డ్రాలో పాల్గొన్నప్పటికీ ఆయనకు అదృష్టం వరించలేదు. దీంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు డిసెంబర్ 24న మళ్లీ బిగ్ టికెట్‌లో లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. ఆ టికెటే ఆయనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. శనివారం తీసిన బిగ్ టికెట్ లక్కీ డ్రాలో జఫ్రీ కొన్న టికెట్ జాక్‌పాట్ కొట్టింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.2కోట్లు తెచ్చిపెట్టింది. అంతే.. జఫ్రీ బ్యాంకు ఖాతాలోకి రాత్రికి రాత్రే భారీ ప్రైజ్‌మనీ వచ్చి చేరింది.


"ఇప్పటివరకు బిగ్ టికెట్ చాలా మంది జీవితాలను మార్చేసింది. ఇవాళ నా వంతు వచ్చింది." అని మురిసిపోయారు. బిగ్ టికెట్ హోస్ట్ బౌచ్రా నుంచి తాను 1 మిలియన్ దిర్హమ్స్ గెలిచినట్లు ఫోన్ కాల్ రావడంతో తన ఇంట్లోని వారందరీ ఆనందానికి అవధుల్లేవని చెప్పుకొచ్చారాయన. 2022ను తన జీవితకాలంలో ఎప్పటికీ మరిచిపోలేనని జఫ్రీ తెలిపారు. ఈ సందర్భంగా బిగ్ టికెట్ నిర్వాహకులపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. నిష్పక్షపాతంగా, నిజాయితీగా బిగ్ టికెట్‌ను నిర్వహించడం వల్లే ఎంతో మంది జీవితాలు రాత్రికి రాత్రే మారిపోతున్నాయన్నారు. ఇక తాను గెలుచుకున్న ఈ భారీ మొత్తంలో కొంత భాగం చారిటీకి వినియోగించనున్నట్లు జఫ్రీ తెలిపారు.      

Updated Date - 2022-01-02T17:20:22+05:30 IST