Singapore కోర్టులో 21 అభియోగాలు ఎదుర్కొంటున్న భారతీయుడు.. జైలు శిక్షతోపాటు జరిమానా పడే ఛాన్స్..

ABN , First Publish Date - 2022-05-21T22:43:02+05:30 IST

భారత్‌కు చెందిన వ్యక్తి సింగపూర్‌లో చీటింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. డబ్బులు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఇద్దరి దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. అయితే కథ అడ్డం

Singapore కోర్టులో 21 అభియోగాలు ఎదుర్కొంటున్న భారతీయుడు.. జైలు శిక్షతోపాటు జరిమానా పడే ఛాన్స్..

ఎన్నారై డెస్క్: భారత్‌కు చెందిన వ్యక్తి సింగపూర్‌లో చీటింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. డబ్బులు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఇద్దరి దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. అయితే కథ అడ్డం తిరగడంతో పోలీసుల చేతికి చిక్కాడు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



సైబర్ నేరగాళ్లకు చిక్కి లేదా రకరకాల సంస్థల్లో డబ్బులు పెట్టుబడిగా పెట్టి మోసపోతున్న వారి సంఖ్య ప్రస్తుతం గణనీయంగా పెరుగుతోంది. ఇలాంటి వారినే సింగపూర్‌లో నివసిస్తున్న భారత్‌కు చెందిన వ్యక్తి మురళీధరన్ ముహుందన్(45) టార్గెట్ చేసుకున్నాడు. డబ్బులు రికవరీ పేరుతో చైనాకు చెందిన ఓయ్ ఫాయ్ చెంగ్(Ooi Phaik Cheng) అనే మహిళను, భారత సంతతి వ్యక్తి మరిముత్తు తిరుమలై‌ని సంప్రదించాడు. వాళ్లు కోల్పోయిన డబ్బును తిరిగి ఇప్పిస్తానని చెప్పి.. మాయమాలు చెప్పాడు. ఇందుకోసం విడతల వారీగా ఇద్దరి వద్దా సుమారు 1.6 సింగపూర్ మిలియన్ డాలర్లను వసూలు చేశాడు. అనంతరం ముఖం చాటేశాడు. దీంతో ఆ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో అధికారులు మురళీధరన్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు 21కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఒక వేళ నేరం రుజువైతే.. మురళీధరన్‌కు జైలు శిక్షతోపాటు భారీ మొత్తంలో జరిమానా పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా డబ్బులు రికవరీ పేరుతో ఎవరైనా సంప్రదిస్తే గుడ్డిగా నమ్మవద్దని సింగపూర్ ప్రజలకు సూచించారు. 


Updated Date - 2022-05-21T22:43:02+05:30 IST