అరుదైన వ్యాధితో మాజీ గోల్‌కీపర్‌ డోరా మృతి

ABN , First Publish Date - 2021-01-27T06:45:17+05:30 IST

భారత ఫుట్‌బాల్‌ మాజీ గోల్‌కీపర్‌ ప్రశాంత డోరా అరుదైన వ్యాధితో మంగళవారం మృతి చెందాడు. 44 ఏళ్ల ప్రశాంత హిమోఫాగోసైటిక్‌ లింఫోహిస్టియోసైటోసిస్‌(హెచ్‌ఎల్‌ఎల్‌) బారిన పడినట్టు వైద్యపరీక్షల్లో...

అరుదైన వ్యాధితో మాజీ గోల్‌కీపర్‌ డోరా మృతి

కోల్‌కతా: భారత ఫుట్‌బాల్‌ మాజీ గోల్‌కీపర్‌ ప్రశాంత డోరా అరుదైన వ్యాధితో మంగళవారం మృతి చెందాడు. 44 ఏళ్ల ప్రశాంత హిమోఫాగోసైటిక్‌ లింఫోహిస్టియోసైటోసిస్‌(హెచ్‌ఎల్‌ఎల్‌) బారిన పడినట్టు వైద్యపరీక్షల్లో తేలిందని అతడి సోదరుడు హేమంత్‌ చెప్పాడు. కేన్సర్‌ రోగుల తరహాలో శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ అతి ప్రతిస్పందన వల్ల హెచ్‌ఎల్‌హెచ్‌ బారినపడే అవకాశం ఉంది. ‘ప్లేట్‌లెట్‌ కౌంట్‌ భారీగా పడిపోయింది. వ్యాధి కారకాన్ని గుర్తించేందుకే డాక్టర్లు చాలా సమయం తీసుకున్నారు. ఆసుపత్రిలో తరచూ రక్తం ఎక్కించినా ప్రాణాలు దక్కలేద’ని హేమంత్‌ తెలిపాడు. శాఫ్‌ కప్‌, శాఫ్‌ గేమ్స్‌లో ప్రశాంత్‌ ప్రాతినిథ్యం వహించాడు. 

Updated Date - 2021-01-27T06:45:17+05:30 IST