కరోనా మార్చిలో వచ్చి కాపాడింది.. అక్టోబరులో అయితేనా..: రాహుల్ ద్రావిడ్

ABN , First Publish Date - 2020-08-02T02:54:21+05:30 IST

క్రికెట్‌పై కరోనా భారీ స్థాయిలో ప్రభావం చూపిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగైదు నెలల నుంచి క్రికెటర్లందరూ...

కరోనా మార్చిలో వచ్చి కాపాడింది.. అక్టోబరులో అయితేనా..: రాహుల్ ద్రావిడ్

న్యూఢిల్లీ: క్రికెట్‌పై కరోనా భారీ స్థాయిలో ప్రభావం చూపిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగైదు నెలల నుంచి క్రికెటర్లందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. అయితే కరోనా వల్ల క్రికెట్‌కు మంచే  జరిగిందని మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ అంటున్నారు. ‘కరోనా మహమ్మారి మార్చిలో విజృంభించడం వల్ల క్రికెట్‌కు మంచే జరిగింది. అప్పటికే బీసీసీఐ దేశవాళీ సీజన్ కూడా ముగింపునకు వచ్చింది. అప్పటి నుంచి పోరాడడంతో కరోనాను కొంతమేర జయించగలిగాం. ఇంగ్లాండ్, వెస్టిండీస్, పాకీస్తాన్ వంటి దేశాలు  క్రికెట్‌ను మళ్లీ  ప్రారంభించగలుగుతున్నాయి. అలాకాకుండా ఒకవేళ కరోనా వ్యాప్తి అక్టోబరులో  మొదలై ఉన్నా.. లేక దాని నుంచి మనల్ని మనం కాపాడుకోలేని స్థితిలో ఉన్నా క్రికెట్‌కు తీవ్ర నష్టం కలిగేద’ని రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డారు.


Updated Date - 2020-08-02T02:54:21+05:30 IST