ఆరోగ్య సేతు కోవిద్-19 ట్రాకర్ యాప్‌ను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-04-02T22:33:49+05:30 IST

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.

ఆరోగ్య సేతు కోవిద్-19 ట్రాకర్ యాప్‌ను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో ముందడుగు వేసి అధికారికంగా ఓ యాప్‌ను విడుదల చేసింది. ఆరోగ్య సేతు కోవిద్-19 ట్రాకర్ యాప్‌ను విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో ఆరోగ్య సేతు కోవిద్-19 ట్రాకర్ యాప్‌ను ప్రారంభించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ యాప్‌ను రూపొందించింది. కోవిద్-19 ట్రాకర్ యాప్ ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్‌తోపాటు 11 భాషలకు సపోర్టు చేస్తోంది.

Updated Date - 2020-04-02T22:33:49+05:30 IST