వివిధ దేశాల్లోని భారత ఎంబసీలకు కేంద్రం హుకుం.. చైనాను ఎదుర్కొనే వ్యూహంతోనే..

ABN , First Publish Date - 2020-08-02T03:48:26+05:30 IST

పలు దేశాల్లోని భారత ఎంబసీలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. రాబోయే చలి కాలంలో కూడా చైనాను...

వివిధ దేశాల్లోని భారత ఎంబసీలకు కేంద్రం హుకుం.. చైనాను ఎదుర్కొనే వ్యూహంతోనే..

న్యూఢిల్లీ: పలు దేశాల్లోని భారత ఎంబసీలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. రాబోయే చలి కాలంలో కూడా చైనాను ఎదుర్కొనే ఉద్దేశంతోనే కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. లడాఖ్ ప్రాంతంలో చలికాలంలో ఉష్ణోగ్రత భారీగా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో సైన్యం అక్కడ నివశించడానికి అనువుగా ఉండదు. అయితే సరిహద్దు ప్రాంతంలో చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా కేంద్రం సరికొత్త కార్యాచరణకు రంగం సిద్ధం చేసింది. ఎత్తైన మంచు కొండల్లో సైతం నివశించేందుకు సైనికులకు అనువుగా ఉండే దుస్తులను, మంచు గుడారాలను తయారు చేసే కంపెనీలను గుర్తించాల్సింగా అమెరికా, రష్యా, యూరప్ వంటి దేశాల్లోని భారత దౌత్య కార్యాలయాలకు మార్గదర్శకాలు పంపించింది. దీంతో అత్యాధునికమైన దుస్తులను సైన్యానికి అందించేందుకు ప్రణాళిక రూపొందించింది. దీనికి తోడు లడాఖ్‌లోని ప్రధాన సైనిక స్థావరమైన థాయిస్ వంటి ప్రాంతాల నుంచి కూడా అవసరమైన వస్తువులను సైన్యానికి అందించేందుకు సిద్ధమవుతోంది.


ఈ మేరకు ఓ కమాండర్ స్థాయి సైనికాధికారి మాట్లాడుతూ, చైనాను ఎట్టి పరిస్థితుల్లో నమ్మలేమని, భారత భూభాగాన్ని కబళించేందుకు ప్రతిక్షణం ఎదురు చూస్తుందని, అందువల్ల సైన్యం ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒకవేళ చైనా సైన్యం ప్రస్తుతానికి వెనుదిరిగినా, 2021 వేసవిలో కచ్చితంగా తిరిగి వస్తుందని, దానికోసం ఇప్పటినుంచే భారత్ సిద్ధమవుతోందని తెలిపారు.

Updated Date - 2020-08-02T03:48:26+05:30 IST