ఐరోపా వేపు భారత ఐటీ కంపెనీల దృష్టి...

ABN , First Publish Date - 2021-01-08T01:50:35+05:30 IST

భారతదేశానికి చెందిన ఐటీ కంపెనీలు ఇప్పుడు యూరోప్ దిశగా మరింత దృష్టి సారిస్తున్నాయి. యూరోప్ నుండి అధిక డీల్స్‌తో పాటు కంపెనీల కొనుగోళ్లకు కూడా ఆసక్తి చూపుతున్నాయి.

ఐరోపా వేపు భారత ఐటీ కంపెనీల దృష్టి...

న్యూఢిల్లీ : భారతదేశానికి చెందిన ఐటీ కంపెనీలు ఇప్పుడు యూరోప్ దిశగా మరింత దృష్టి సారిస్తున్నాయి.  యూరోప్  నుండి అధిక డీల్స్‌తో పాటు కంపెనీల కొనుగోళ్లకు కూడా ఆసక్తి చూపుతున్నాయి. దేశీయ టెక్ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సంస్థలు గత కొద్దికాలంగా యూరోపియన్ మార్కెట్ పై దృష్టి పెట్టాయి. ఇటీవల యూరోపియన్ ప్రాంతం నుండి భారీ డీల్స్ రావడంతో దేశీయ ఐటీ కంపెనీలు రూటు మార్చినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు మన ఐటీ కంపెనీలకు ఎక్కువ రాబడి అమెరికా నుండే. ఆదాయంలో అగ్రరాజ్యం వాటా 70 శాతం. కాగా... కంపెనీలు ఇటీవల యూరోపియన్ సంస్థలను కొనుగోలు చేస్తున్నాయి. మరిన్ని కొనుగోళ్లు, పెద్ద డీల్స్ రానున్నాయని ఐటీ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. 


జర్మన్ మార్కెట్... యూరోప్ నుండి చూసుకుంటే జర్మనీ నుండి ఇటీవల మెగా డీల్స్ వచ్చాయని, జర్మన్ కంపెనీలు గతంలో ఔట్ సోర్సింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదని, ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయని హెచ్‌ఎఫ్ఎస్ రీసెర్చ్ సీఈవో చెప్పారు. జర్మన్ కంపెనీలు వ్యూహం మార్చి ఔట్ సోర్సింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలకు అవకాశాలు పెరిగినట్లు చెబుతున్నారు. కాగా పట్టుకోసం టీసీఎస్ యూరోప్ మార్కెట్‌లో  ప్రయత్నాలు చేస్తోందని, ఈ ప్రాంతంలో మరిన్ని అక్వైజేషన్స్ ఉండవచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు. 

Updated Date - 2021-01-08T01:50:35+05:30 IST