మరో స్వదేశీ యుద్ధవిమానం

ABN , First Publish Date - 2020-06-05T07:20:19+05:30 IST

స్వదేశీ తేజస్‌ యుద్ధ విమానం విజయంతో ఉత్సాహం పుంజుకున్న భారత్‌ మరో కొత్త యుద్ధ విమానాన్ని కూడా దేశీయంగా అభివృద్ధి చేయబోతోంది. తేజ్‌సలో ఒకే ఇంజిన్‌ ఉండగా రెండు ఇంజిన్లతో ఈ కొత్త విమానం రూపుదిద్దుకోనుంది...

మరో స్వదేశీ యుద్ధవిమానం

  • నౌకాదళ తేజస్‌-2కు పచ్చజెండా
  • ఆరేళ్లలో తొలి వాయు విహారం
  • రఫేల్‌, ఎఫ్‌-18ల మేలిమి మిశ్రమం
  • యుద్ధనౌకపై మిగ్‌-29లకు తోడు
  • 8000 కోట్లతో విమానం అభివృద్ధికి ప్రణాళిక


న్యూఢిల్లీ, జూన్‌ 4: స్వదేశీ తేజస్‌ యుద్ధ విమానం విజయంతో ఉత్సాహం పుంజుకున్న భారత్‌ మరో కొత్త యుద్ధ విమానాన్ని కూడా దేశీయంగా అభివృద్ధి చేయబోతోంది. తేజ్‌సలో ఒకే ఇంజిన్‌ ఉండగా రెండు ఇంజిన్లతో ఈ కొత్త విమానం రూపుదిద్దుకోనుంది. భారత నౌకాదళం కోసం ఈ విమానాన్ని తయారు చేసేందుకు ఏరోనాటికల్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ (ఏడీఏ) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన ఇటీవల జరిగిన ఏడీఏ సమావేశంలో ఇందుకు ఆమోదముద్ర వేసినట్లు ఎన్డీటీవీ తెలిపింది. నౌకాదళ అవసరాల కోసం తేజస్‌ యుద్ధ విమానంలో కొన్ని మార్పులు చేసి తేజస్‌-ఎన్‌ పేరిట నేవల్‌ వెర్షన్‌ను ఏడీఏ రూపొందించింది. ఈ తేజ్‌స-ఎన్‌ను భారత విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎ్‌స విక్రమాదిత్యపై పరీక్షించిన రక్ష ణ నిపుణులు టేకాఫ్‌, ల్యాండింగ్‌ తీరుపై సంతృప్తి చెందారు. తేజ్‌సను ఆధారంగా చేసుకుని రెండు ఇంజిన్లతో నౌకాదళం కోసం ప్రత్యేకంగా మరో యుద్ధ విమానాన్ని రూపొందించనున్నారు. వాయుసేన కోసం తేజ్‌స-మార్క్‌2 పేరిట ఒక యుద్ధ విమానం తయారీని భారత్‌ ఇప్పటికే ప్రారంభించింది. అయితే నౌకాదళ తేజస్‌-2 విమానం వాయుసేన విమానం కంటే భిన్నమైనది, ఆధునికమైనది. ఫ్రెంచ్‌ రఫేల్‌ (నౌకాదళ వెర్షన్‌), అమెరికన్‌ ఎఫ్‌-18 సూపర్‌ హార్నెట్‌ విమానాల లక్షణాలతో ఈ విమానాన్ని తయారు చేయాలని నిర్దేశించారు. భారత విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎ్‌స విక్రమాదిత్యపై ప్రస్తుతం మిగ్‌-29 విమానాలను మోహరిస్తున్నారు. కొత్తగా ఐఎన్‌ఎ్‌స విక్రాంత్‌ అనే మరో విమాన వాహకనౌకను భారత్‌ రూపొందిస్తోంది. ఈ రెండింటిపై మిగ్‌-29లతో పాటు తేజ్‌స-2ను కూడా భవిష్యత్తులో మోహరిస్తారు.


Updated Date - 2020-06-05T07:20:19+05:30 IST