Abn logo
Sep 10 2021 @ 09:27AM

Kuwait లో మృత శిశువుకు జన్మనిచ్చిన Indian పనిమనిషి.. ఆమె ఎవరో తనకు తెలియదంటున్న యజమాని..

కువైత్ సిటీ: కువైత్‌లో తన యజమాని ఇంట్లో ఓ గుర్తు తెలియని భారతీయ పనిమనిషి మృత శిశువుకు జన్మనిచ్చింది. అయితే, యజమాని మాత్రం ఆమె ఎవరో తనకు తెలియదని అంటున్నారు. దాంతో జహ్రా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చనిపోయిన శిశువుకు జన్మనిచ్చిన గుర్తు తెలియని భారతీయ గృహ కార్మికురాలిపై విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కువైత్‌లోని సాద్ అల్ అబ్దుల్లాలో ఇటీవల ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఓ ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న 39 ఏళ్ల భారతీయ మహిళ మృత శిశువుకు జన్మనిచ్చింది. బొడ్డు తాడు మెడకు చుట్టుకోవడంతో ఊపిరాడక శిశువు చనిపోయి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.      


ఇవి కూడా చదవండి..

కన్నవాళ్లు కాదనుకున్న Gujarat చిన్నారిని.. American జంట అక్కున చేర్చుకోబోతోంది..

నుదిటిపై రూ.176 కోట్ల విలువైన వజ్రం.. American Rap Singer కు అభిమానులే షాకిచ్చారు..!


ఇదిలాఉంటే.. మృత శిశువుకు జన్మనిచ్చిన పనిమనిషి ఎవరో తనకు తెలియదని యజమాని అంటున్నారు. అసలు పనిమనిషి గర్భావతి అనే విషయం కూడా తన దృష్టికి రాలేదని చెప్పారు. దాంతో మిస్టరీగా ఉన్న ఈ కేసును సీఐడీకి అప్పగించారు. ప్రస్తుతం పనిమనిషి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కోలుకున్న తర్వాత సీఐడీ అధికారులు ఆమెను విచారించనున్నారు. విచారణ అనంతరం నివేదికను ఇవ్వాల్సిందిగా జహ్రా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆదేశించారు. 


తాజా వార్తలుమరిన్ని...