కరోనా రూల్స్ బ్రేక్ చేసిన భారతీయుడు.. బహ్రెయిన్‌లో మూడేళ్ల జైలు!

ABN , First Publish Date - 2021-06-18T03:13:30+05:30 IST

భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి కరోనా నిబంధనలు ఉల్లంఘించడంతో అతనికి మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ బహ్రెయిన్ కోర్టు తీర్పునిచ్చింది.

కరోనా రూల్స్ బ్రేక్ చేసిన భారతీయుడు.. బహ్రెయిన్‌లో మూడేళ్ల జైలు!

బహ్రెయిన్: భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి కరోనా నిబంధనలు ఉల్లంఘించడంతో అతనికి మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ బహ్రెయిన్ కోర్టు తీర్పునిచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బిహార్‌కుచెందిన మహమ్మద్ ఖలీద్ అనే వ్యక్తి బహ్రెయిన్ వెళ్లాడు. అక్కడి నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్ ట్రాకర్ రిస్ట్‌బ్యాండ్ ధరించి క్వారంటైన్‌లో ఉన్నాడు. ఈ సమయంలో అతను రిస్ట్‌బ్యాండ్ ధరించి బయట తిరుగుతున్న ఒక వీడియో నెట్టింట్లో ప్రత్యక్షమైంది. దీన్ని చూసిన అధికారులు క్వారంటైన్‌లో ఉండకుండా బయట తిరుగుతూ నిబంధనలు ఉల్లంఘించాడంలూ ఖలీద్‌ను అరెస్టు చేశారు. అతనిపై విచారణ జరిపిన కోర్టు మూడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.9.73లక్షల జరిమానా విధించింది. భారతదేశంలో ఉన్న అతని కుటుంబ సభ్యులు ఈ సమస్యను విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఖలీద్ క్వారంటైన్ పీరియడ్ పూర్తయిపోయిందని, ఆ తర్వాత కరోనా నెగిటివ్ కూడా వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అతన్ని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.

Updated Date - 2021-06-18T03:13:30+05:30 IST