విమాన సర్వీసుల పునరుద్ధరణ.. గల్ఫ్ దేశాలతో చర్చించాలని రాయబారులకు భారత విదేశాంగశాఖ సూచన

ABN , First Publish Date - 2021-07-11T15:04:51+05:30 IST

కరోనా నేపథ్యంలో గల్ఫ్ దేశాలు భారత విమానాల రాకపోకలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.

విమాన సర్వీసుల పునరుద్ధరణ.. గల్ఫ్ దేశాలతో చర్చించాలని రాయబారులకు భారత విదేశాంగశాఖ సూచన

గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసుల పునరుద్ధరణపై భారత్ ఫోకస్!

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో గల్ఫ్ దేశాలు భారత విమానాల రాకపోకలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పడుతున్నందున విమాన సర్వీసుల పునరుద్ధరణ కోసం గల్ఫ్ దేశాలతో చర్చించాలని ఆయా దేశాల్లోని భారత రాయబారులను విదేశాంగమంత్రిత్వ శాఖ సూచించింది. తాజాగా మంత్రి వీ మురళీధరన్ ఈ విషయమై గల్ఫ్ దేశాల్లోని ఇండియన్ అంబాసిడర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాయబారులను భారత్‌కు గల్ఫ్ దేశాలు తిరిగి విమాన సర్వీసులు ప్రారంభించేలా చర్చలు జరపాలని కోరినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు. ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితులు మెరుగవుతున్నాయి కనుక గల్ఫ్ దేశాలు భారత్‌పై విధించిన నిషేధ ఆంక్షలను తొలగిస్తాయని భావిస్తున్నట్లు బాగ్చి చెప్పారు. ఇటలీలో ఇటీవల జరిగిన జీ-20 సదస్సులో కూడా భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ సౌదీ అధికారులతో ఇదే విషయమై మాట్లాడారని గుర్తు చేశారు.   

Updated Date - 2021-07-11T15:04:51+05:30 IST