యూఎస్‌లో వీసా మోసానికి పాల్ప‌డిన భార‌తీయుడి అరెస్ట్..!

ABN , First Publish Date - 2020-08-22T20:04:40+05:30 IST

వీసా మోసానికి పాల్ప‌డిన ఆరోపణలపై ఓ భార‌తీయుడిని అమెరిక‌న్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యూఎస్‌లో వీసా మోసానికి పాల్ప‌డిన భార‌తీయుడి అరెస్ట్..!

వాషింగ్ట‌న్ డీసీ: వీసా మోసానికి పాల్ప‌డిన ఆరోపణలపై ఓ భార‌తీయుడిని అమెరిక‌న్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోసపూరితంగా పొందిన హెచ్-1బీ వీసాలను ఉపయోగించి విదేశీ పౌరులను అమెరికాకు ర‌ప్పించిన‌ ఆరోపణలపై భారత వ్య‌క్తిని అరెస్టు చేసినట్లు ఫెడరల్ ప్రాసిక్యూటర్లు శుక్రవారం తెలిపారు. గురువారం అరెస్టైన‌ 48 ఏళ్ల ఆశిష్ సాహ్నీ అనే భార‌త సంత‌తి వ్య‌క్తి  మోస‌పూరితంగా హెచ్-1బీ వీసాల కోసం కుట్ర చేయ‌డంతో పాటు వాటి ద్వారా ఇత‌ర దేశాల‌కు చెందిన వారిని యూఎస్‌కు ర‌ప్పించాడు. ఇలా 2011-16 మ‌ధ్య‌ అక్ర‌మార్గంలో ఏకంగా 21 మిలియ‌న్ డాల‌ర్లు(రూ.1,573,515,300) సంపాదించాడ‌ని అధికారులు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో ఉన్న ఈ కేసులో నేరం రుజువైతే సాహ్నీకి గరిష్టంగా ప‌దేళ్ల‌ జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌ని ప్రాసిక్యూటర్లు తెలిపారు.

Updated Date - 2020-08-22T20:04:40+05:30 IST