Advertisement
Advertisement
Abn logo
Advertisement

పుట్టిన రోజునాడు Onlineలో సరదాగా చేసిన పని.. అతడికి రేంజ్ రోవర్ కారును తెచ్చిపెట్టింది!

ఎన్నారై డెస్క్: పుట్టిన రోజునాడు ఓ వ్యక్తి సరదాగా చేసిన పని.. అతడికి రేంజ్ రోవర్ కారును తెచ్చిపెట్టింది. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రేంజ్ రోవర్ కారుకు యజమాని అవుతానని కలలో కూడా ఊహించలేదని సదరు వ్యక్తి సంతోషం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో.. అతడు ఎవరు.. పుట్టిన రోజు ఏం చేశాడు.. అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


భారత సంతతికి చెందిన రానా సజ్నాని అనే 35ఏళ్ల వ్యక్తి.. దుబాయిలోనే పుట్టి, అక్కడే పెరిగాడు. ఈ క్రమంలోనే నవంబర్ 2న పుట్టిన రోజు సందర్భంగా ఆన్‌లైన్‌ ద్వారా దుబాయ్ డ్యూటీ ఫ్రీలో పాల్గొన్నాడు. ఏకంగా 20 లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో శనివారం నిర్వహించిన డ్రాలో అతడికి జాక్‌పాట్ తగిలింది. రేంజ్ రోవర్ కారును అతడు గెలుపొందాడు. దీంతో రానా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఇకపై కూడా లాటరీ టికెట్లు కొనుగోలూ చేస్తూ మరిన్ని బహుమతులు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు.Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement