భారత నావికా దళం మరింత బలోపేతం

ABN , First Publish Date - 2021-03-11T00:27:11+05:30 IST

భారత నావికా దళం మరింత బలోపేతమైంది. ప్రాజెక్ట్

భారత నావికా దళం మరింత బలోపేతం

న్యూఢిల్లీ : భారత నావికా దళం మరింత బలోపేతమైంది. ప్రాజెక్ట్-75లో భాగంగా మూడో స్కార్పీన్ క్లాస్ జలాంతర్గామి ఐఎన్ఎస్ కరంజ్‌ బుధవారం ప్రవేశించడంతో నావికా దళం శక్తి, సామర్థ్యాలు మరింత పెరిగాయి. రెండేళ్ళపాటు క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత దీనిని నావికా దళంలో ప్రవేశపెట్టారు. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా దీనిని తయారు చేశారు.


చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ (సీఎన్ఎస్) అడ్మిరల్ కరంబీర్ సింగ్ బుధవారం మాట్లాడుతూ, మూడో స్కార్పీన్ క్లాస్ జలాంతర్గామి ఐఎన్ఎస్ కరంజ్‌‌ను సముద్రంలో పరీక్షల కోసం 2018 జనవరిలో నావికా దళంలో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ జలాంతర్గామి ప్రవేశించడంతో ఇండియన్ నేవీ సామర్థ్యం, బలం పెరుగుతాయని చెప్పారు. 


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్రాంత అడ్మిరల్ వీఎస్ షెఖావత్ మాట్లాడుతూ, మనం భారత దేశంలో ఉన్నామన్నారు. మన దేశం అనేక ఉపగ్రహాలను ప్రయోగిస్తోందని, న్యూక్లియర్ సబ్‌మెరైన్లను తయారు చేస్తోందని, ప్రపంచం కోసం వ్యాక్సిన్లను తయారు చేస్తోందని చెప్పారు. ఈ నూతన కరంజ్ జలాంతర్గామి ‘మేక్ ఇన్ ఇండియా’కు మరొక ఉదాహరణ అని తెలిపారు. 


షెఖావత్ పాత కరంజ్ జలాంతర్గామి సిబ్బందిలో ఒకరు. ఆయన 1971లో భారత్-పాకిస్థాన్ యుద్ధంలో ఈ జలాంతర్గామికి కమాండింగ్ ఆఫీసర్‌ కూడా.


Updated Date - 2021-03-11T00:27:11+05:30 IST