ఐక్యరాజ్యసమితి పదవికి భారతీయుడి రాజీనామా?

ABN , First Publish Date - 2020-03-30T20:22:41+05:30 IST

ఐక్యరాజ్యసమితిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారతీయ ఉన్నతాధికారి సుధీర్ రాజ్‌కుమార్.. తన పదవికి రాజీనామా చేశారు.

ఐక్యరాజ్యసమితి పదవికి భారతీయుడి రాజీనామా?

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారతీయ ఉన్నతాధికారి సుధీర్ రాజ్‌కుమార్.. తన పదవికి రాజీనామా చేశారు. ఆయన్ను స్వయంగా ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్.. ఉమ్మడి పెన్షన్ నిధి ఆస్తుల పెట్టుబడి విభాగం ప్రతినిధిగా  నియమించినట్లు తెలుస్తోంది. 2007లో ఈ బాధ్యతలు స్వీకరించిన సుధీర్.. అప్పటి నుంచి చక్కగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని గుటెరస్ కార్యాలయ ప్రతినిధి వెల్లడించారు. అయితే సుధీర్ రాజీనామాకు గల కారణాలను ఆయన వెల్లడించలేదు.

Updated Date - 2020-03-30T20:22:41+05:30 IST