Canada రక్షణశాఖ మంత్రిగా భారతీయురాలు!

ABN , First Publish Date - 2021-10-28T00:09:37+05:30 IST

కెనడాలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ మహిళ అనిత ఆనంద్‌కు తాజాగా జస్టిస్ ట్రూడో ప్రభుత్వంలో కీలక బాధ్యతలు దక్కాయి.

Canada రక్షణశాఖ మంత్రిగా భారతీయురాలు!

ఒట్టావా: కెనడాలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ మహిళ అనిత ఆనంద్‌కు తాజాగా జస్టిస్ ట్రూడో ప్రభుత్వంలో కీలక బాధ్యతలు దక్కాయి. అనిత ఆ దేశ నూతన రక్షణ మంత్రిగా ఎంపికయ్యారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రధాని ట్రూడో ఆమెను రక్షణ మంత్రిగా నియమించారు. ఈ మేరకు మంగళవారం ప్రధాని కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె పబ్లిక్ సర్వీసెస్ మినిస్టర్‌గా ఉన్నారు. కాగా, కెనడా రక్షణ మంత్రిగా ఉన్న భారత సంతతికే చెందిన హర్జీత్‌ సజ్జన్‌ స్థానంలో అనిత బాధ్యతలు చేపట్టనున్నారు. సైన్యంలో లైంగిక వేధింపుల అంశానికి సంబంధించిన దర్యాప్తులో ఆయన తీరుపై ప్రతిపక్షాలు, మీడియా విరుచుకుపడడంతో ట్రూడో ఆయనను రక్షణ శాఖను తప్పించారు. సజ్జన్‌ను అంతర్జాతీయ అభివృద్ధి శాఖ మంత్రిగా నియమించారు. అనితకు రక్షణశాఖను అప్పగించారు. 54 ఏళ్ల అనిత ఓక్ విల్లే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే కెనడా రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న రెండో మహిళగా ఆమె రికార్డుకెక్కారు. 

Updated Date - 2021-10-28T00:09:37+05:30 IST