Australiaలో తెలుగోడికి అరుదైన గౌరవం.. తొలి భారత సంతతి వ్యక్తిగా గుర్తింపు

ABN , First Publish Date - 2021-12-16T13:10:21+05:30 IST

భారతీయ సంతతికి చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్తకు అస్ట్రేలియాలో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా నేషనల్‌ యూనివర్సిటీ (ఏఎన్‌యూ)లో నానో టెక్నాలజీ, భౌతికశాస్త్రంలో విశేష పరిశోధనలు చేసిన చెన్నుపాటి జగదీశ్‌... ఆస్ట్రేలియా అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. వచ్చే ఏడాది మేలో జగదీశ్‌ కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు.

Australiaలో తెలుగోడికి అరుదైన గౌరవం.. తొలి భారత సంతతి వ్యక్తిగా గుర్తింపు

ఆస్ట్రేలియా సైన్స్‌ అకాడమీ అధ్యక్షుడిగా చెన్నుపాటి జగదీశ్‌

ఈ పదవికి ఎంపికైన తొలి భారతీయ సంతతి వ్యక్తిగా గుర్తింపు

కాన్‌బెర్రా, డిసెంబరు 15 : భారతీయ సంతతికి చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్తకు అస్ట్రేలియాలో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా నేషనల్‌ యూనివర్సిటీ (ఏఎన్‌యూ)లో నానో టెక్నాలజీ, భౌతికశాస్త్రంలో విశేష పరిశోధనలు చేసిన చెన్నుపాటి జగదీశ్‌... ఆస్ట్రేలియా అకాడమీ ఆఫ్‌ సైన్స్‌  కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. వచ్చే ఏడాది మేలో జగదీశ్‌ కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ పదవి చేపట్టిన తొలి భారతీయ సంతతి వ్యక్తిగా ఆయన గుర్తింపుపొందారు. దేశంలో ప్రముఖ శాస్త్రవిజ్ఞానసంస్థల్లో ఒకటైన ఆస్ట్రేలియా సైన్స్‌ అకాడమీ ..విజ్ఞానశాస్త్ర విషయాలపై పార్లమెంట్‌కు అధికారికంగా సలహాలను అందజేస్తుంది. కాగా, ప్రపంచంలో అతిచిన్న లేజర్లపై జగదీశ్‌ ఎన్నో పరిశోధనలు చేశారు. అతితక్కువ బరువున్న ఫ్లెక్సిబుల్‌  సోలార్‌ సెల్స్‌ రూపకల్పనలో, మతిమరుపు బాధితుల చికిత్సలో ఆయన పరిశోధనలు ఎంతగానో ఉపకరించాయి. భౌతిక శాస్త్రంలో చేసిన కృషికి గుర్తింపుగా దేశంలోనే అత్యున్నతమైన ఆస్ట్రేలియన్‌డే అవార్డును కూడా ఆయన అందుకున్నారు. సైన్స్‌ అకాడమీ కొత్త అధినేతగా ఎంపికైనందుకు ఆనందంగా ఉందని జగదీశ్‌ చెప్పారు.

Updated Date - 2021-12-16T13:10:21+05:30 IST