బ్రిటన్ ప్రభుత్వంపై న్యాయపోరాటానికి సిద్ధమైన భారత సంతతి వైద్యురాలు!

ABN , First Publish Date - 2020-05-30T22:01:37+05:30 IST

కరోనా వైరస్ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వంపై ఓ భారత సంతతి వైద్యురాలు న్యాయపోరాటం చేయడానికి సిద్ధమయ్యారు. ఎనిమిది నెలల గర్భిణి అయినప్పటికీ బ్రిటన్ ప్రధా

బ్రిటన్ ప్రభుత్వంపై న్యాయపోరాటానికి సిద్ధమైన భారత సంతతి వైద్యురాలు!

లండన్: కరోనా వైరస్ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వంపై ఓ భారత సంతతి వైద్యురాలు న్యాయపోరాటం చేయడానికి సిద్ధమయ్యారు. ఎనిమిది నెలల గర్భిణి అయినప్పటికీ బ్రిటన్ ప్రధాని కార్యాలయం పరిసరాల్లో మౌనదీక్షకు దిగారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోన్న విషయం తెలిసిందే. బ్రిటన్‌లో కూడా ఈ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో డాక్టర్ మీనల్ విజ్ అనే భారత సంతతి వైద్యురాలు.. డాక్టర్లకు సరిపడినన్ని పీపీఈ కిట్లను అందించడంలో బ్రిటన్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పీపీఈ కిట్ల కొరత గురించి ప్రపంచానికి తెలిసేలా.. ప్రధాని బోరిస్ జాన్సన్ కార్యాలయం వీధిలో కొంత మంది వైద్యులతో కలిసి ఆమె మౌన దీక్షకు దిగారు.


అంతేకాకుండా ఈ విషయంలో బ్రిటన్ ప్రభుత్వంపై న్యాయపరంగా పోరడటానికి దాదాపు రూ. 50 లక్షల విరాళాలు సేకరించినట్లు తెలిపారు. కరోనా మహమ్మారిపై చేస్తున్న పోరులో ముందు వరుసలో ఉన్న వైద్యులకు కృతజ్ఙతలు తెలిపేందుకు బ్రిటన్‌లో ప్రతి వారం నిర్వహిస్తున్న ‘క్లాప్ ఫర్ కేరర్స్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ‘క్లాప్ ఫర్ కేరర్స్’ కార్యక్రమం పొలిటికల్ స్టంట్‌గా మారిందని ఆమె విమర్శించారు. సరైన రక్షణ పరికరాలు లేకపోవడం వల్ల కరోనా మహమ్మారికి దాదాపు 237 మంది వైద్యులు బలయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. బ్రిటన్‌లో ఇప్పటి వరకు 2.71లక్షల మంది కరోనా వైరస్ బారిన పడగా.. 38వేల మందికిపైగా మరణించారు. కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. బ్రిటన్ రెండో స్థానంలో ఉంది.  


Updated Date - 2020-05-30T22:01:37+05:30 IST