భారత సంతతి వ్యక్తికి నాలుగేళ్ల శిక్ష విధించిన సింగపూర్ కోర్టు

ABN , First Publish Date - 2020-08-12T03:08:28+05:30 IST

లైంగిక వేధింపుల కేసులో సింగపూర్ కోర్టు మంగళవారం ఓ భారత సంతతి వ్యక్తికి నాలుగేళ్ల

భారత సంతతి వ్యక్తికి నాలుగేళ్ల శిక్ష విధించిన సింగపూర్ కోర్టు

సింగపూర్: లైంగిక వేధింపుల కేసులో సింగపూర్ కోర్టు మంగళవారం ఓ భారత సంతతి వ్యక్తికి నాలుగేళ్ల మూడు నెలల జైలుశిక్షను విధిస్తున్నట్టు తీర్పునిచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డెలివరి డ్రైవర్‌గా పనిచేసిన కన్నాన్ సుకుమారన్ అనే వ్యక్తి మే 12న రాత్రి 7.30 గంటల సమయంలో వ్యాన్‌లో కూర్చొని అశ్లీల చిత్రాలు చూస్తున్నాడు. ఇదే సమయంలో పేవ్‌మెంట్‌పై జాగింగ్ చేస్తూ వెళ్తున్న 36 ఏళ్ల బాధితురాలిని చూశాడు. వెంటనే ఆమెను అనుసరిస్తూ వెళ్లి ఆమెను పేవ్‌మెంట్ పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. సుకుమారన్ నుంచి తప్పించుకోవాలని బాధితురాలు ప్రయత్నించగా.. ఇదే సమయంలో బాధితురాలిపై సుకుమారన్ దాడికి దిగాడు. దీంతో ఆమె కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రక్షించడండి అంటూ ఆమె గట్టిగా అరిచింది. ఆమె అరుపుతో కొంతమంది జాగర్లు అక్కడకు చేరుకోవడాన్ని సుకుమారన్ గమనించి వెంటనే వ్యాన్‌లో పారిపోయాడు. అయితే ఓ జాగర్ వ్యాన్ నెంబర్ చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు. ఈ సమాచారంతోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు కోర్టుకు వెళ్లడంతో సుకుమారన్ చేసిన నేరానికి కోర్టు నాలుగేళ్ల మూడు నెలల శిక్ష విధిస్తున్నట్టు తీర్పునిచ్చింది.

Updated Date - 2020-08-12T03:08:28+05:30 IST