భారత సంతతి మహిళను సెనెటర్ అభ్యర్థిగా ప్ర‌క‌టించిన ఒబామా

ABN , First Publish Date - 2020-08-07T20:20:15+05:30 IST

భారత సంతతికి చెందిన‌ సారా గిడియాన్(48) అనే మ‌హిళ‌ను అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మైనే రాష్ట్రం డెమొక్రటిక్ పార్టీ సెనెటర్ అభ్యర్థిగా ప్ర‌క‌టించారు.

భారత సంతతి మహిళను సెనెటర్ అభ్యర్థిగా ప్ర‌క‌టించిన ఒబామా

వాషింగ్టన్‌ డీసీ: భారత సంతతికి చెందిన‌ సారా గిడియాన్(48) అనే మ‌హిళ‌ను అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మైనే రాష్ట్రం డెమొక్రటిక్ పార్టీ సెనెటర్ అభ్యర్థిగా ప్ర‌క‌టించారు. గిడియాన్‌ తండ్రి భార‌తీయుడు కాగా‌, తల్లి అమెరిక‌న్‌. గిడియాన్ ప్రస్తుతం మైనే స్టేట్ అసెంబ్లీ స్పీకర్‌గా కొన‌సాగుతున్నారు. రిపబ్లికన్ సెనేటర్ సుసాన్ కాలిన్స్‌కు గట్టి పోటీ ఇస్తున్నారని ఇటీవ‌ల వెలువ‌డిన పోల్స్ ఫలితాలు తేల్చాయి. దీంతో గిడియాన్‌ను అభ్యర్థిగా నిల‌బెడితే ఆ సెనెటర్ స్థానం డెమొక్రటిక్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంద‌ని పార్టీ నేతలు న‌మ్మకంగా ఉన్నారు.


ఇక యూఎస్‌లో ప్ర‌ధాన సెనెటర్ స్థానాల్లో మైనే రాష్ట్రం కూడా ఒకటి. నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో ఇక్క‌డ‌‌ అత్యధిక పోటీ ఉంటుంది. క‌నుక ఈ స్థానాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న డెమొక్ర‌టిక్ పార్టీ అధిష్టానం ప్ర‌త్య‌ర్థికి గ‌ట్టి పోటీ ఇవ్వాలంటే గిడియాన్‌నే క‌రెక్ట్ అని న‌మ్ముతోంది. అందుకే ఒబామా వ్యూహాత్మకంగా ఆమె పేరును ప్ర‌క‌టించారని తెలుస్తోంది. ఒకవేళ ఆమె ఎన్నికైతే అమెరికా సెనెట్‌కు ఎన్నికైన రెండో ఇండియన్ అమెరికన్ మహిళ‌గా నిలుస్తారు. అంత‌కుముందు కాలిఫోర్నియా నుంచి తొలిసారి భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ అమెరికా సెనేట్‌కు ఎన్నికైన విష‌యం తెలిసిందే.  

Updated Date - 2020-08-07T20:20:15+05:30 IST