Abn logo
Sep 9 2021 @ 22:20PM

Americaలో భారతీయ సంతతి Uber డ్రైవర్‌ హత్య.. 15 ఏళ్ల కుర్రాడే హంతకుడు

అమెరికాలో భారతీయ సంతతి ఉబర్ డ్రైవర్‌‌‌ హత్య జరిగింది. చంపింది ఓ 15ఏళ్ల కుర్రాడు. ఉబర్‌ ట్యాక్సీలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి, యువకుడికి మధ్య జరిగిన కాల్పుల్లో ఉబర్ డ్రైవర్‌కు కూడా బుల్లెట్లు తగిలాయి. దీంతో అతడు తీవ్రంగా గాయపడగా.. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ అతడు మరణించాడు. ఈ మేరకు న్యూయార్క్ పోలీసులు వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే.. భారతీయ సంతతికి చెందిన కుల్దీప్ సింగ్(21) అమెరికాలో ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 4వ తేదీ శనివారం ఓ వ్యక్తిని తన ట్యాక్సీలో తీసుకెళుతుండగా.. 15ఏళ్ల కుర్రాడు ఆ ప్రయాణికుడిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ట్యాక్సీలోని ప్రయాణికుడు కూడా ఆ యువకుడిపై కాల్పులు జరిపారు. 

ఈ కాల్పుల్లో కుల్దీప్ సింగ్‌కు కూడా బుల్లెట్లు తగిలాయి. మైనర్ బాలుడు జరిపిన కాల్పుల్లోనే కుల్దీప్ గాయపడినట్లు న్యూయార్క్ పోలీసులు తెలిపారు. అయితే ట్యాక్సీలోని ప్రయాణికుడు జరిపిన కాల్పుల్లో ఆ కుర్రాడికి కూడా గాయాలయ్యాయని, కుల్దీప్‌తో పాటు అతడిని కూడా ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకెళ్లామని తెలిపారు. అయితే చికిత్స పొందుతూ  కుల్దీప్ సింగ్ బుధవారం మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.

తాజా వార్తలుమరిన్ని...