కీలక కాంగ్రెస్ కమిటీలకు ఇద్దరు భారతీయ అమెరికన్లు

ABN , First Publish Date - 2021-01-27T21:53:45+05:30 IST

భారత సంతతి అమెరికా చట్టసభ సభ్యులు ప్రమిలా జయపాల్, రాజా కృష్ణమూర్తి పేర్లను బడ్జెట్, కొవిడ్-19 మహమ్మారిపై ఏర్పాటైన కీలక కాంగ్రెస్ కమిటీలకు హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి సిఫార్సు చేశారు.

కీలక కాంగ్రెస్ కమిటీలకు ఇద్దరు భారతీయ అమెరికన్లు

వాషింగ్టన్: భారత సంతతి అమెరికా చట్టసభ సభ్యులు ప్రమిలా జయపాల్, రాజా కృష్ణమూర్తి పేర్లను బడ్జెట్, కొవిడ్-19 మహమ్మారిపై ఏర్పాటైన కీలక కాంగ్రెస్ కమిటీలకు హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి సిఫార్సు చేశారు. శక్తివంతమైన బడ్జెట్ కమిటీకి కాంగ్రెస్ సభ్యురాలు జయాపాల్‌ను, కరోనావైరస్ సంక్షోభంపై ఏర్పాటైన మరో కీలక కమిటీకి కాంగ్రెస్ సభ్యుడు కృష్ణమూర్తిని స్పీకర్ మంగళవారం నామినేట్ చేశారు. తమకు దక్కిన ఈ గౌరవం పట్ల ఇరువురు సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.


"కరోనా కమిటీ చైర్మన్ క్లైబర్న్‌తో కలిసి పని చేయబోతున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ప్రస్తుత మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో నాకు కీలక బాధ్యతలు అప్పగించారు. కొవిడ్‌ను జయించి అమెరికన్ల ఆరోగ్యం, భద్రతను కాపాడుతాం. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుధ్దరిస్తాం." అని కృష్ణమూర్తి అన్నారు. ఆయన 2017 నుంచి ఇల్లినాయిస్ 8వ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ నుంచి యూఎస్ ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయ-అమెరికన్ మహిళ జయపాల్. కనీస వేతనం గంటకు 15 డాలర్లు అనే అంశానికి ఆమె నాయకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జయపాల్‌ కీలక బడ్జెట్ కమిటీకి ఎన్నికయ్యారు. ఆమె 2017 నుంచి వాషింగ్టన్ 7వ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ నుంచి యూఎస్ ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Updated Date - 2021-01-27T21:53:45+05:30 IST