అబుధాబిలో పాస్‌పోర్ట్ రెన్యూవ‌ల్ సేవ‌లు ప్రారంభించిన భార‌త ఎంబ‌సీ

ABN , First Publish Date - 2020-07-09T16:36:10+05:30 IST

మ‌హ‌మ్మారి క‌రోనా నేప‌థ్యంలో మార్చి నుంచి నిలిచిపోయిన పాస్‌పోర్ట్ రెన్యూవ‌ల్ సేవ‌ల‌ను తిరిగి ప్రారంభిస్తున్న‌ట్లు అబుధాబిలోని భార‌త ఎంబ‌సీ కార్యాల‌యం బుధ‌వారం ప్ర‌క‌టించింది.

అబుధాబిలో పాస్‌పోర్ట్ రెన్యూవ‌ల్ సేవ‌లు ప్రారంభించిన భార‌త ఎంబ‌సీ

అబుధాబి: మ‌హ‌మ్మారి క‌రోనా నేప‌థ్యంలో మార్చి నుంచి నిలిచిపోయిన పాస్‌పోర్ట్ రెన్యూవ‌ల్ సేవ‌ల‌ను తిరిగి ప్రారంభిస్తున్న‌ట్లు అబుధాబిలోని భార‌త ఎంబ‌సీ కార్యాల‌యం బుధ‌వారం ప్ర‌క‌టించింది. పాస్‌పోర్ట్ సేవ‌ల‌పై ఉన్న అన్ని ఆంక్ష‌ల‌ను తొల‌గిస్తున్న‌ట్లు వెల్ల‌డించిన రాయ‌బార కార్యాల‌యం ఈ నెల 15 నుంచి అన్ని బీఎల్ఎస్‌ కేంద్రాల్లో రెన్యూవ‌ల్ సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని తెలిపింది. కాగా, 60 ఏళ్ల‌కు పైబ‌డిన వృద్ధులు, 12 ఏళ్ల‌లోపు పిల్ల‌లు, గ‌ర్భిణీలు, అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారికి వ్య‌క్తిగ‌తంగా పాస్‌పోర్ట్ రెన్యూవ‌ల్ కోసం బీఎల్ఎస్‌ కేంద్రాల‌కు హాజ‌రుకావ‌డంలో  వెసులుబాటు క‌లిపించింది. ఇక పాస్‌పోర్ట్ కేంద్రాల‌కు వ‌చ్చే వారు త‌ప్ప‌నిస‌రిగా సామాజిక దూరం పాటించ‌డంతో పాటు ముఖానికి మాస్కులు ధ‌రించ‌డం, చేతుల‌కు గ్లౌజులు వేసుకోవాల‌ని సూచించింది. ఈ మేర‌కు ఇండియ‌న్ ఎంబ‌సీ బుధ‌వారం ట్వీట్ చేసింది.



Updated Date - 2020-07-09T16:36:10+05:30 IST