రైల్వేలో సర్క్యులర్ టిక్కెట్ అంటే ఏమిటి? 8 టిక్కెట్ల విలువ కలిగిన దీనిని ఎలా తీసుకోవాలో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-01-22T15:19:27+05:30 IST

మీరు రైలులో చాలాసార్లు ప్రయాణించి ఉంటారు.

రైల్వేలో సర్క్యులర్ టిక్కెట్ అంటే ఏమిటి? 8 టిక్కెట్ల విలువ కలిగిన దీనిని ఎలా తీసుకోవాలో తెలిస్తే..

మీరు రైలులో చాలాసార్లు ప్రయాణించి ఉంటారు. రైలు టిక్కెట్ల గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు రిజర్వ్డ్ లేదా అన్‌రిజర్వ్డ్ టిక్కెట్ల గురించి చర్చ జరుగుతుంది. లేదా ఏసీ, స్లీపర్ క్లాస్ మొదలైన వాటి గురించి మాట్లాడుకుంటాం. కానీ ఇవే కాకుండా మరో టికెట్ కూడా ఉందని మీకు తెలుసా? దీనినే సర్క్యులర్ టికెట్ అని అంటారు. ఈ టిక్కెట్ ద్వారా మీరు ఏకకాలంలో అనేక స్టేషన్లకు సంబంధించిన టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. మరి ఆ టిక్కెట్ ఎవరికి ప్రయోజనం? దానిని ఎలా తీసుకోవాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

సర్క్యులర్ టికెట్ అంటే ఏమిటి?

మీరు తీర్థయాత్రలు లేదా వివిధ ప్రాంతాల సందర్శన కోసం అనేక ప్రదేశాలకు వెళ్లాలనుకుంటే, భారతీయ రైల్వే మీకు సర్క్యులర్ టికెట్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. అన్ని వర్గాలకు ఈ సర్క్యులర్ ప్రయాణ టిక్కెట్లు జారీ చేయవచ్చు. వృత్తాకార ప్రయాణ టిక్కెట్‌ను జారీ చేయడానికి ముందు, సర్క్యులర్ టికెట్ కోసం ప్రయాణికులు.. విరామ ప్రయాణం కోసం గరిష్టంగా ఎనిమిది స్టేషన్లు తెలియజేయాలి. మీరు లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు ఈ టిక్కెట్ తీసుకుంటే వివిధ స్టేషన్ల నుండి టిక్కెట్లను బుక్ చేయవలసిన అవసరం లేదు. మీరు మీ షెడ్యూల్ ప్రకారం ఒక టిక్కెట్ కొనుగోలు చేస్తే సరిపోతుంది. ఈ ఒక్క టికెట్ వివిధ రైళ్లలో చెల్లుబాటు అవుతుంది. సర్క్యులర్ టిక్కెట్ చెల్లుబాటు అనేది ప్రయాణ రోజులు, విరామ ప్రయాణ రోజులను పరిగణనలోకి తీసుకొని నిర్ధారిస్తారు. టిక్కెట్‌పై పేర్కొన్న ప్రయాణ తేదీ నుండి టిక్కెట్ చెల్లుబాటు అవుతుంది. విరామ సమయంలో ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఎలాంటి పరిమితి లేదు.




ఎన్ని స్టేషన్లకు టిక్కెట్లు జారీ చేస్తారు?

సర్క్యులర్ టికెట్ గరిష్టంగా 8 విరామ ప్రయాణాలకు జరీచేస్తారు. సర్క్యులర్ టిక్కెట్లపై ప్రయాణ ఎండార్స్‌మెంట్ విరామం అవసరం లేదు.

సర్క్యులర్ టికెట్ టిక్కెట్ ధర ఎంత?

సర్క్యులర్ టికెట్  అనేది ప్రయాణంలోని వివిధ దశలకు రిజర్వేషన్ ఛార్జీలు, సూపర్ ఫాస్ట్ రైళ్లలో అనుబంధ ఛార్జీలు మొదలైనవాటిపై ఆధారపడివుంటుంది. ప్రయాణీకుడు హై క్లాస్ రైళ్లలో ప్రయాణిస్తే, అతను పాయింట్-టు-పాయింట్ ప్రాతిపదికన టిక్కెట్ రుసుము చెల్లించాలి.

ఎలా బుక్ చేసుకోవచ్చు?

ప్రయాణ మార్గాన్ని నిర్ణయించుకున్న తర్వాత, కొన్ని ప్రధాన స్టేషన్‌ల డివిజన్‌కు చెందిన డివిజనల్ కమర్షియల్ మేనేజర్‌ను సంప్రదించవచ్చు, ఇందులో జర్నీ ఆరిజినేటింగ్ స్టేషన్ కూడా ఉంటుంది. దీని తర్వాత, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ లేదా స్టేషన్ అధికారులు మీ ప్రయాణ వివరాల ఆధారంగా టిక్కెట్ల ధరను అంచనా వేస్తారు. షెడ్యూల్ రూట్ గురించి అక్కడి స్టేషన్ మేనేజర్‌కు కూడా తెలియజేస్తారు. మీరు ప్రయాణించాలనుకునే స్టేషన్‌లోని టికెట్ హౌస్ నుండి ఒక ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మీరు సర్క్యులర్ టికెట్ కొనుగోలు చేయవచ్చు. సర్క్యులర్ టికెట్ కొనుగోలు చేసిన తర్వాత, మీరు ప్రయాణంలోని వివిధ దశల కోసం సీట్లు/బెర్త్‌ల రిజర్వేషన్ కోసం రిజర్వేషన్ కార్యాలయాన్ని సంప్రదించాల్సివుంటుంది. దీని తర్వాత మీరు ప్రయాణం కోసం రిజర్వ్ చేసిన ప్రయాణ టిక్కెట్టు జారీ చేస్తారు.

షరతులు ఉంటాయా?

అదే స్టేషన్ నుండి ప్రారంభమై అక్కడ ముగిసే సర్క్యులర్ టికెట్లపై సాధారణ బ్రేక్-ట్రిప్ నియమాలు వర్తించవు. తక్కువ మార్గంలో తిరుగు ప్రయాణం కోసం జారీ చేసిన టిక్కెట్‌ట్లను సర్క్యులర్ టికెట్లుగా పరిగణించరు. 

Updated Date - 2022-01-22T15:19:27+05:30 IST