సరుకు రవాణాలో రికార్డులకెక్కిన ఇండియన్ రైల్వే

ABN , First Publish Date - 2021-06-02T00:08:01+05:30 IST

భారతీయ రైల్వే మరోమారు రికార్డులకెక్కింది. మే నెలలో అత్యధికంగా సరుకు రవాణా చేసిన సరికొత్త రికార్డు సృష్టించింది. కరోనా

సరుకు రవాణాలో రికార్డులకెక్కిన ఇండియన్ రైల్వే

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే మరోమారు రికార్డులకెక్కింది. మే నెలలో అత్యధికంగా సరుకు రవాణా చేసి  సరికొత్త రికార్డు సృష్టించింది. కరోనా సంక్షోభం వేళ గత నెలలో 114.8 మిలియన్ టన్నులు రవాణా చేసింది. మే 2019లో 104.6 టన్నుల సరుకు రవాణా చేసింది. ఇప్పటి వరకు అదే అత్యధికం కాగా, ఇప్పుడా రికార్డు బద్దలైంది. 2019 మేతో పోలిస్తే ఇది 9.7 శాతం అధికం. భారతీయ రైల్వేకు గత నెలలో ఆదాయం, సరుకు రవాణా ఎక్కువగా ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. 


మేలో చేసిన మొత్తం సరుకు రవాణాలో 54.52 మిలియన్ టన్నుల బొగ్గు, 15.12 మిలియన్ టన్నుల ఇనుప రజను, 5.61 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 3.68 మిలియన్ టన్నుల ఎరువులు, 3.18 మిలియన్ టన్నుల మినరల్ అయిల్, 5.36 మిలియన్ టన్నుల సిమెంట్ (క్లింకర్ కాకుండా),4.2 మిలియన్ టన్నుల క్లింకర్ ఉన్నట్టు రైల్వే పేర్కొంది. ఫలితంగా గత నెలలో 11,604 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 


మే నెలలో వేగన్ టర్న్ అరౌండ్ టైమ్ 26 శాతం మెరుగైందని రైల్వే పేర్కొంది. 2019 మేలో ఇది 6.46 రోజులుగా ఉండగా, మే 2021లో అది 4.81 శాతానికి తగ్గింది. అలాగే, గత 18 నెలలుగా సరుకు రవాణాలో వేగం పెరిగిందని రైల్వే తెలిపింది.

Updated Date - 2021-06-02T00:08:01+05:30 IST