Advertisement
Advertisement
Abn logo
Advertisement

యజమాని మోసం.. Saudi లో ఇద్దరు భారత సోదరులకు 3ఏళ్ల జైలు.. అసలేం జరిగిందంటే..

జెడ్డా: తాము పనిచేసే యజమాని లోన్‌పై కొత్త కారు కొనుగోలు చేసిన సమయంలో దాని తాలుకు పత్రాలపై భారతీయ సోదరులు సంతకం చేశారు. అదే వారి కొంపముంచింది. ఇద్దరు సోదరులను ఏకంగా మూడేళ్లు జైలుపాలు చేసింది. ఇటీవల శిక్షకాలం పూర్తి కావడంతో తాజాగా జైలు నుంచి విడుదలై స్వదేశానికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కేరళ  రాష్ట్రం తైకాడప్పురం కాసరగోడ్‌కు చెందిన షంశుద్దీన్, మోతీన్ కుంజీ సోదరులు మూడేళ్ల కింద ఉపాధి కోసం సౌదీ వెళ్లారు. అక్కడ అజీర్ ప్రొవిన్స్‌లోని మహాయేల్‌లో ఓ వ్యక్తి వద్ద పనికి కుదిరారు. ఆ వ్యక్తి సౌదీ జాతీయుడు. అతను కిరాణా దుకాణం, హోటల్, పెట్రోల్ పంప్ మూడింటినీ ఓకే చోట ఏర్పాటు చేసి ఒక సంస్థగా నడిపిస్తున్నాడు. ఈ సంస్థలోనే కుంజీ సోదరులు పనికి కుదిరారు. 

కొన్నిరోజుల తర్వాత సదరు యజమాని ఓ లోన్‌పై ఓ కొత్తకారు కొన్నాడు. ఆ సమయంలో ఈ సోదరులను మాయమాటలు చెప్పి లోన్ తాలుకూ పత్రాలపై వారి సంతకాలు తీసుకున్నాడు. అనంతరం వారికి తెలియకుండా 60వేల రియాల్(సుమారు రూ.12లక్షలు) లోన్ డబ్బులు సోదరుల పేరు మీదకు మార్చాడు. ఆ తర్వాత వారి జీతాల నుంచి ఆ నగదు నెలవారీగా తీసుకోవడం ప్రారంభించాడు. అదేంటని అడిగినందుకు కుంజీ సోదరులపై తప్పుడు పోలీస్ కేసు పెట్టాడు. అనంతరం కొన్ని రోజులకు లోన్‌పై కొన్న కారును తక్కువ రేటుకే మరో వ్యక్తికి అమ్మేశాడు. దాంతో మిగతా డబ్బులు సోదరులు కట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో సోదరులు ఉద్యోగాలు కోల్పోయారు. 


దాంతో వేరే ఉద్యోగాల కోసం వెతుకుతున్న సమయంలో పోలీసులకు పట్టుబడి కటకటాల వెనక్కి వెళ్లారు. ఎలాగోలా తాము చెల్లించాల్సిన నగదు కోర్టు ద్వారా కట్టేసిన సోదరులు మూడేళ్ల తర్వాత జైలు నుంచి బయటడ్డారు. బహిష్కరణ కేంద్రానికి చేరిన కుంజీ సోదరులు కరోనా నేపథ్యంలో ఇంకొన్ని రోజుల అక్కడే ఉండాల్సి వచ్చింది. తాజాగా ఇండియన్ సోషల్ ఫోరమ్ జోక్యం చేసుకుని అక్కడి నుంచి వారిని కేరళకు పంపించే ఏర్పాటు చేసింది. దాంతో తాజాగా షంశుద్దీన్, మోతీన్ కుంజీ స్వస్థలమైన కాసరగోడ్‌కు చేరుకున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement