మేరీ, సిమ్రన్‌, అమిత్‌కు టోక్యో బెర్త్‌లు

ABN , First Publish Date - 2020-03-10T10:08:29+05:30 IST

భారత స్టార్‌ బాక్సర్‌ మేరీ కోమ్‌ (51 కిలోలు), సిమ్రన్‌ జిత్‌ కౌర్‌ (60 కి), వరల్డ్‌ నెంబర్‌వన్‌ అమిత్‌ పంగల్‌ (52 కిలోలు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత

మేరీ, సిమ్రన్‌, అమిత్‌కు టోక్యో బెర్త్‌లు

ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌

సెమీస్‌లో భారత బాక్సర్లు 

అమ్మాన్‌ (జోర్డాన్‌): భారత స్టార్‌ బాక్సర్‌ మేరీ కోమ్‌ (51 కిలోలు), సిమ్రన్‌ జిత్‌ కౌర్‌ (60 కి), వరల్డ్‌ నెంబర్‌వన్‌ అమిత్‌ పంగల్‌ (52 కిలోలు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. మనీష్‌ కౌశిక్‌ (63 కిలోలు) క్వార్టర్స్‌లో ఓడినా.. టోక్యో బెర్త్‌ కోసం పోటీపడనున్నాడు. ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా సోమవారం జరిగిన క్వార్టర్స్‌లో మేరీ 5-0తో ఐరిష్‌ మాంగో (ఫిలిప్పీన్స్‌)ను చిత్తు చేసి సెమీ్‌సకు దూసుకెళ్లింది. సిమ్రన్‌జిత్‌ 5-0తో నమున్‌ మోంఖర్‌ (మంగోలియా)పై గెలిచింది. అమిత్‌ 4-1తో కార్లో పాలమ్‌ (ఫిలిప్పీన్స్‌)ను ఓడించి సెమీ్‌సకు చేరాడు. కౌశిక్‌ 2-3తో చిన్‌జోరిగ్‌ బటార్‌సుఖ్‌ (మంగోలియా) చేతిలో ఓడాడు. కానీ, క్వార్టర్స్‌లో ఓడిన వారి మధ్య నిర్వహించే బాక్సాఫ్‌లో కౌశిక్‌ నెగ్గితే ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాడు. జూనియర్‌ వరల్డ్‌ మాజీ చాంపియన్‌ సాక్షి చౌదరి (57 కి) ఒలింపిక్‌ బెర్త్‌ మిస్సయింది. క్వార్టర్స్‌లో సాక్షి 0-5తో ఇమ్‌ ఏజి (కొరియా) చేతిలో చిత్తయింది. ఈ టోర్నీలో సెమీ్‌స చేరుకున్న వారికి నేరుగా ఒలింపిక్‌ బెర్త్‌లు దక్కుతాయి. దీంతో టోక్యో టికెట్‌ సంపాదించాలంటే మేలో జరిగే వరల్డ్‌ క్వాలిఫయర్స్‌లో రూపంలో సాక్షికి మరో చాన్సుంది. ఇక సూపర్‌ హెవీ వెయిట్‌ (+91 కి)లో సెమీస్‌ చేరిన సతీష్‌ కుమార్‌.. ఈ విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత బాక్సర్‌గా నిలిచాడు. 

Updated Date - 2020-03-10T10:08:29+05:30 IST