రూ.4 లక్షల కోట్లు ఫట్‌

ABN , First Publish Date - 2022-02-12T06:47:55+05:30 IST

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వారాంత ట్రేడింగ్‌లో భారీ నష్టాలను చవిచూశాయి. ప్రపంచ మార్కెట్లతోపాటు దలాల్‌స్ట్రీట్‌లోనూ అమ్మకాలు పోటెత్తడంతో సెన్సెక్స్‌ 773.11 పాయిం ట్లు క్షీణించి 58,152.92 వద్దకు జారుకుంది. నిఫ్టీ 231.10 పాయింట్లు ..

రూ.4 లక్షల కోట్లు ఫట్‌

  • సెన్సెక్స్‌ 773 పాయింట్లు డౌన్‌ 
  • 17,400 దిగువ స్థాయికి నిఫ్టీ  
  • ఫెడ్‌ రేట్ల పెంపు భయాలతో పోటెత్తిన అమ్మకాలు 


ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వారాంత  ట్రేడింగ్‌లో భారీ నష్టాలను చవిచూశాయి. ప్రపంచ మార్కెట్లతోపాటు దలాల్‌స్ట్రీట్‌లోనూ అమ్మకాలు పోటెత్తడంతో సెన్సెక్స్‌ 773.11 పాయిం ట్లు క్షీణించి 58,152.92 వద్దకు జారుకుంది. నిఫ్టీ 231.10 పాయింట్లు పతనమై 17,374.75 వద్ద ముగిసింది. 40 ఏళ్ల గరిష్ఠ స్థాయికి ఎగబాకిన ధరలకు కళ్లెం వేసేందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను గత అంచనాల కంటే వేగంగా, అధికంగా పెంచవచ్చన్న భయాందోళనలతో ప్రపంచ దేశాల ఈక్విటీ మదుపర్లు భారీగా అమ్మకాలకు పాల్పడ్డారు. రూపాయి పతనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ మన మార్కెట్‌పై ఒత్తిడిని మరింత పెంచాయి. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 5 మినహా అన్నీ నష్టాల్లో ముగిశాయి. 


ఐపీఓకు క్లౌడ్‌నైన్‌ దరఖాస్తు: తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ద్వారా రూ.1,200 కోట్లు సమీకరించేందుకు అనుమతి కోరుతూ కిడ్స్‌ క్లినిక్‌ ఇండియా లిమిటెడ్‌ శుక్రవారం సెబీకి ముసాయిదా పత్రాలు  (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. 


రూపాయే..!

దేశీయ కరెన్సీ విలువ మరింత క్షీణించింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు ఏకంగా 24 పైసలు క్షీణించి రూ.75.39గా నమోదైంది. ఈక్విటీ మార్కెట్ల నష్టాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, అంతర్జాతీయ మార్కెట్లో భగ్గుమంటున్న ముడి చమురు ధరలు మన రూపాయి విలువకు గండికొట్టాయి. 

Updated Date - 2022-02-12T06:47:55+05:30 IST