చైనా హాస్టల్ గదిలో భారతీయ యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-08-03T06:29:55+05:30 IST

చదువుకోవడానికి చైనా వెళ్లిన భారతీయ యువకుడు ఊహించని విధంగా హాస్టల్ గదిలో శవమై కనిపించాడు.

చైనా హాస్టల్ గదిలో భారతీయ యువకుడి మృతి

టియాన్జిన్: చదువుకోవడానికి చైనా వెళ్లిన భారతీయ యువకుడు ఊహించని విధంగా హాస్టల్ గదిలో శవమై కనిపించాడు. ఈ ఘోరం చైనాలోని టియాన్జిన్ పట్టణంలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బిహార్‌లోని గయకు చెందిన అమన్ నాగ్‌సేన్(20) అనే యువకుడు ఉన్నత చదువుల కోసం చైనా వెళ్లాడు. ఇక్కడ ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్ కోర్సు చదువుతున్నాడు. ఈ క్రమంలో జూలై 23న కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడాడు కూడా. ఆ తర్వాత నుంచి భారత్‌లోని కటుంబ సభ్యులు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా స్పందించడం లేదు. ఈ క్రమంలో అతని కోసం వెతగ్గా.. హాస్టల్ గదిలో శవమై కనిపించాడు. అమన్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక వేరే కారణాలతో మరణించాడా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అమన్ మరణ వార్త బిహార్‌లోని అతని కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. తమ బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేని అమన్ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.

Updated Date - 2021-08-03T06:29:55+05:30 IST