డకౌట్‌తో ఆరంభించాడు

ABN , First Publish Date - 2021-04-17T09:02:41+05:30 IST

భారత టెస్టు స్పెషలిస్ట్‌ హనుమ విహారి తన కౌంటీ అరంగేట్రాన్ని డకౌట్‌తో ఆరంభించాడు.

డకౌట్‌తో ఆరంభించాడు

నాటింగ్‌హామ్‌: భారత టెస్టు స్పెషలిస్ట్‌ హనుమ విహారి తన కౌంటీ అరంగేట్రాన్ని డకౌట్‌తో ఆరంభించాడు. వార్విక్‌షైర్‌ తరఫున ఆడుతున్న విహారి 40 నిమిషాలపాటు క్రీజులో ఉండి 23 బంతులు ఎదుర్కొన్నా ఖాతా తెరవలేదు. రెండో ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చిన అతడు నాటింగ్‌హామ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. అంతకు ముందు ఒక ఓవర్‌ బౌలింగ్‌ వేసి 11 పరుగులిచ్చాడు.

Updated Date - 2021-04-17T09:02:41+05:30 IST