రూ.కోటి జరిమానా మాఫీ.. 13 ఏళ్ల తర్వాత ఇంటికి చేరిన తెలుగోడు!

ABN , First Publish Date - 2020-09-16T20:41:05+05:30 IST

ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని.. యూఏఈకి వెళ్లిన ఓ వ్యక్తికి ఆ దేశ ప్రభుత్వం భారీ సాయం చేసింది. సుమారు కోటి రూపాలయ జరి

రూ.కోటి జరిమానా మాఫీ.. 13 ఏళ్ల తర్వాత ఇంటికి చేరిన తెలుగోడు!

దుబాయి: ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని.. యూఏఈకి వెళ్లిన ఓ వ్యక్తికి ఆ దేశ ప్రభుత్వం భారీ సాయం చేసింది. సుమారు కోటి రూపాలయ జరిమానాను మాఫీ చేసింది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణకు చెందిన 47ఏళ్ల పోతుగొండ మేడీ.. ఓ ఏజెంట్ మాటలు నమ్మి 2007లో యూఏఈలో అడుగుపెట్టాడు. తీరా అక్కడికి వెళ్లాక సదరు ఏజెంట్ తనను మోసం చేసినట్లు ఆయన గ్రహించాడు. దీంతో ఏం చేయాలో తెలియక పొట్టకూటికోసం చిన్నచిన్న పనులు చేసుకుంటూ కాలం వెల్లదీశాడు. ఇంతలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి మొదలైంది. ఈ నేపథ్యంలో పొతుగొండ మేడీకి పూటగడవటం కష్టంగా మారింది. ఈ క్రమంలో ఆయన దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయాన్ని సంప్రదించాడు. తన సమస్యను వివరించి, సాయం చేయాల్సిందిగా కోరాడు. దీంతో రంగంలోకి దిగిన కాన్సులేట్ అధికారులు.. యూఏఈ ప్రభుత్వంతో చర్చించారు. కాన్సులేట్ అధికారుల వినతిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. 13ఏళ్లుగా అక్రమంగా నివసిస్తున్నందుకుగాను పోతుగొండ మేడీ.. కట్టాల్సిన కోటి రూపాయాల జరిమానాను మాఫీ చేస్తునట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఆయన సుమారు 13ఏళ్ల తర్వాత ఇంటికి చేరుకున్నాడు. 


Updated Date - 2020-09-16T20:41:05+05:30 IST