America: ఇబ్బందుల్లో భారత్‌కు చెందిన నూతన వధువు

ABN , First Publish Date - 2021-08-06T01:00:57+05:30 IST

భారత్‌కు చెందిన నూతన వధువు అగ్రరాజ్యం అమెరికాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తనకు సహాయం చేయాల్సిందిగా అమెరికాలోని ఇండియన్ ఎంబసీకి పంపిన ఫిర్యాదులో పేర్కొ

America: ఇబ్బందుల్లో భారత్‌కు చెందిన నూతన వధువు

వాషింగ్టన్: భారత్‌కు చెందిన నూతన వధువు అగ్రరాజ్యం అమెరికాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తనకు సహాయం చేయాల్సిందిగా అమెరికాలోని ఇండియన్ ఎంబసీకి పంపిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బిహార్‌లోని పాట్నా ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ఎన్నారైతో కొద్ది రోజుల క్రితం వివాహం అయింది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది మార్చిలో ఆమె భర్తతో కలిసి అమెరికా వెళ్లారు. సంతోషంగా నూతన జీవితాన్ని ప్రారంభించాలని ఆశపడ్డ ఆ మహిళకు అమెరికాకు వెళ్లిన తర్వాత భర్త షాకిచ్చాడు. అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. భర్త పెట్టే చిత్రహింసలను భరించలేక ఆ మహిళ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆమెను తన భర్త నడిరోడ్డుపై వదిలేశాడు. దిక్కుతోచని పరిస్థితుల్లో తన పరిస్థితిని వివరిస్తూ భర్తపై అమెరికాలోని ఇండియన్ ఎంబసీకి ఫిర్యాదు చేశారు.



అందులో.. ‘అదనపు కట్నం కోసం నా  భర్త నన్ను తీవ్రంగా వేధించేవాడు. శారీరకంగా మానసింగా హింసించే వాడు. పిల్లలు పుట్టకుండా ఉండేందుకు గర్భనిరోధక పరికరాలను వాడుతున్నానని సందేహించేవాడు. ఈ అనుమానాలతోనే బాత్‌రూంకు వెళ్లినపుడు కూడా డోర్ తెరిచే ఉంచాలని నాతో వాదించేవాడు. అంతేకాకుండా నా జననాంగాలను కూడా పరిశీలించేవాడు. ఒంటరిగా ఎక్కడికీ వెళ్లనిచ్చే వాడు కాదు. దీంతో నేను పోలీసులను ఆశ్రయించాను. జరిగింది చెప్పి, సహాయం చేయాల్సిందిగా కోరాను. ఈ నేపథ్యంలోనే నా భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఖర్చులకు డబ్బులు కూడా ఇవ్వకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టాడు. ఈ విషయం తెలిసి ఇండియాలో ఉన్న నా తల్లిదండ్రులు.. నా అత్తామామల సహాయం తీసుకున్నారు. నా భర్తకు నచ్చజెప్పి చూశారు. అయినా అతను ఆ మాటలను లెక్కచేయడం లేదు. అదనంగా కట్నం ఇస్తేనే ఇంట్లోకి రానిస్తానని తెగేసి చెబుతున్నాడు. దయచేసి నాకు సహాయం చేయండి’ అంటూ భారత ప్రభుత్వం, అమెరికాలోని ఇండియన్ ఎంబసీకి పంపిన ఫిర్యాదులో సదరు మహిళ పేర్కొన్నారు.


Updated Date - 2021-08-06T01:00:57+05:30 IST