Facebook Post తెచ్చిన తంటా.. చేయని నేరానికి Saudi జైల్లో మగ్గుతున్న భారతీయుడు.. విడిపించాలంటూ భార్య వేడుకోలు!

ABN , First Publish Date - 2021-11-14T16:48:17+05:30 IST

చేయని నేరానికి అన్యాయంగా తన భర్త గత 20 నెలలుగా సౌదీ అరేబియాలో జైలులో మగ్గుతున్నాడని, వెంటనే కేంద్ర విదేశాంగశాఖ కలుగజేసుకుని విడిపించాలంటూ కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన ఓ మహిళ విన్నవిస్తోంది.

Facebook Post తెచ్చిన తంటా.. చేయని నేరానికి Saudi జైల్లో మగ్గుతున్న భారతీయుడు.. విడిపించాలంటూ భార్య వేడుకోలు!

మంగళూరు: చేయని నేరానికి అన్యాయంగా తన భర్త గత 20 నెలలుగా సౌదీ అరేబియాలో జైలులో మగ్గుతున్నాడని, వెంటనే కేంద్ర విదేశాంగశాఖ కలుగజేసుకుని విడిపించాలంటూ కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన ఓ మహిళ విన్నవిస్తోంది. ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్‌‌లో దైవదూషణ చేశాడంటూ తన భర్తను అన్యాయంగా జైల్లో పెట్టారని ఆమె చెబుతోంది. అయితే, అది తన భర్త చేసిన పని కాదని, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన పేరు, ఫొటోను ఉపయోగించి ఫేక్ ఖాతా ద్వారా ఇస్లాం, సౌదీ రాజును దూషిస్తూ పోస్టులు పెట్టారని ఆమె పేర్కొంది. అసలు ఆ పోస్టుతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే ఎవరో అన్యాయంగా తన భర్తను ఇందులో ఇరికించారని ఆమో వాపోయింది. అందుకే నిర్ధోషి అయిన తన భర్తను జైలు నుంచి విడిపించి స్వదేశానికి తీసుకురావాలని అధికారులను కోరుతోంది. 


ఆయన సలహా మేరకు ఫిబ్రవరి 16న ఫిర్యాదు చేసేందుకు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అయితే, పోలీసులు రివర్స్‌లో శైలేష్‌పై కేసు నమోదు చేసి జైల్లో పెట్టారు. ఈ విషయం స్వదేశంలో ఉన్న కవితకు తెలిసింది. దాంతో అప్పటి నుంచి తన భర్తను విడిపించేందుకు ఆమె ప్రయత్నిస్తోంది. చేయని నేరానికి తన భర్తను జైల్లో పెట్టడం ఏంటని ఆమె వాపోతోంది. జితేందర్ కొట్టారి అనే సామాజిక కార్యకర్త, బీజేపీ నేత ద్వారా ఆమె ఎంపీ నలిన్ కుమార్ కతీల్‌ను కలిసి తన గోడును వెళ్లబోసుకుంది. కవిత ఇచ్చిన సమాచారంతో కతీల్ ఈ విషయాన్ని విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. నిర్ధోషి అయిన శైలేష్‌ను విడిపించాలని ఆయన మంత్రిత్వశాఖను అభ్యర్థించారు. అలాగే ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై, ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ దృష్టికి కూడా తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా కవిత, జితేందర్ పేర్కొన్నారు. 


దీనిలో భాగంగా ఈ నెల 19న ఎంపీ కతీల్ ద్వారా మంత్రి జైశంకర్‌ను కలవాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు. అటు సౌదీలో ఉన్న దక్షిణ కన్నడాకు చెందిన పలువురు ఎన్నారైలు కూడా ఈ విషయంలో తమకు సహాకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కవిత చెప్పారు. ప్రస్తుతం జైల్లో ఉన్న తన భర్తతో ఫోన్‌లో మాట్లాడేందుకు కూడా అక్కడి అధికారులు అనుమతించడం లేదని ఆమె తెలిపింది. శైలేష్‌ను సౌదీ అధికారులు క్రమం తప్పకుండా కోర్టులో హాజరుపరుస్తున్నప్పటికీ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదని ఆమె పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు విదేశాంగ శాఖ కలుగజేసుకుని తన భర్తను విడిపించాలని కవిత వేడుకుంటోంది.       


వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బర్నకట్టె వాసి శైలేష్ కొట్టారి 20 ఏళ్లుగా సౌదీ అరేబియాలో ఉపాధి పొందుతున్నాడు. ఆతిథ్య రంగానికి చెందిన అక్కడి ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆయన భార్య కవిత కొట్టారి, పిల్లలు స్వదేశంలో ఉంటున్నారు. ఇక సౌదీలో ఉన్న శైలేష్.. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టానికి అనుకూలంగా ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టడంతో ఆయనకు బెదిరింపు కాల్స్ వెళ్లాయి. దాంతో భయపడిన ఆయన తన ఫేస్‌బుక్ ఖాతాను డిలీట్ చేశాడు. ఈ క్రమంలో గతేడాది జనవరి 23న తన పేరుపై ఓ ఫేస్‌బుక్ పేజీ ఉన్నట్లు గుర్తించాడు. దానిపై తన ఫొటో కూడా చూశాడు. అంతేగాక ఆ పేజీ నుంచి సౌదీ రాజుతో పాటు ఇస్లాంను దూషిస్తూ సందేశాలు సైతం ఉన్నాయి. శైలేష్ ఈ విషయాన్ని తాను పనిచేస్తున్న కంపెనీ యజమాని దృష్టికి తీసుకెళ్లాడు. దాంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు. 

Updated Date - 2021-11-14T16:48:17+05:30 IST