Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘క్యాండిడేట్స్‌’కు హంపి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): భారత మహిళా గ్రాండ్‌మాస్టర్‌.. వరల్డ్‌ నెంబర్‌-2 కోనేరు హంపి క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. గతంలో పురుషులకు మాత్రమే ఈ టోర్నమెంట్‌ను నిర్వహించేవారు. 2018 నుంచి మహిళల విభాగంలో కూడా ఈ టోర్నీని ప్రారంభించారు. ప్రపంచంలోని టాప్‌ ఎనిమిది మంది చెస్‌ దిగ్గజాలు మాత్రమే ఇందులో ఆడతారు. గత ఏడాది జరిగిన రష్యా, మొనాకో గ్రాండ్‌ ప్రీలో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న తెలుగుతేజం వాటి ద్వారా సాధించిన పాయింట్లతో క్యాండిడేట్స్‌కు అర్హత సాధించింది. కొవిడ్‌ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ టోర్నీ జరిగే ప్రదేశం, తేదీలు ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే ఫిడే ఈ వివరాలను అధికారికంగా ప్రకటించనుంది.


Advertisement
Advertisement