రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డు రేసులో మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్

ABN , First Publish Date - 2020-06-02T21:44:10+05:30 IST

ప్రతిష్ఠాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డుకు టీమిండియా మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్‌ నామినేట్

రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డు రేసులో మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డుకు టీమిండియా మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్‌ నామినేట్ అయింది. వందన కటారియా, మోనికా, హర్మన్‌ప్రీత్ సింగ్‌లు అర్జున అవార్డుకు నామినేట్ అయ్యారు. మేజర్ ధ్యాన్‌చంద్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుకు మాజీ ఆటగాడు ఆర్పీసింగ్, తుషార్ ఖండేకర్‌లను హాకీ ఇండియా నామినేట్ చేసింది. కోచ్‌లు బీజే కరియప్ప, రొమేశ్ పఠానియాలను ద్రోణాచార్య అవార్డుకు నామినేట్ చేసింది. 


రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డుకు 1 జనవరి 2016 నుంచి 31 డిసెంబరు 2019 మధ్య ఆటను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ కాలంలో రాణి సారథ్యంలోని హాకీ జట్టు 2017 మహిళల ఆసియాకప్‌లో చారిత్రాత్మక విజయం సాధించింది. 2018లో ఆసియా గేమ్స్‌లో రజత పతకం సాధించింది. 2019లో ఎఫ్ఐహెచ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో రాణి నిర్ణయాత్మక గోల్ సాధించి జట్టును టోక్యో ఒలింపిక్స్‌కు చేర్చింది. రాణి ఇప్పటికే వరల్డ్ గేమ్స్ ‘అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’, 2016 అర్జున అవార్డు, 2020లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది.   

Updated Date - 2020-06-02T21:44:10+05:30 IST