Abn logo
May 22 2020 @ 08:12AM

‘ఇండియన్‌2’ లొకేషన్‌ మార్పు

విశ్వనటుడు కమల్‌హాసన్‌, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇండియన్‌2’ మళ్లీ పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. లాక్‌డౌన్‌కు ముందు షూటింగ్‌ స్పాట్‌లో జరిగిన ప్రమాదం కారణంగా షూటింగ్‌ తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ ముగిసిన అనంతరం మళ్లీ చిత్రీకరణను జరిపేందుకు సినిమా యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. అయితే ప్రమాదం జరిగిన పూందమల్లి సమీపంలోని స్టూడియో నుంచి లొకేషన్‌ మార్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. చెన్నై విమానాశ్రయం సమీపంలోని బిన్నీ మిల్లులో సెట్‌ వేసి చిత్రీకరణ చేయనున్నట్లు కోలీవుడ్‌ టాక్‌. కాగా, ఈ చిత్రంలో కమల్‌ రెండు పాత్రల్లో నటిస్తుండగా,  కాజల్‌ అగర్వాల్‌, ప్రియ భవాని శంకర్‌, సిద్ధార్ధ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement