Joe Biden తాజా నిర్ణయాన్ని స్వాగతించిన భారత అమెరికన్లు

ABN , First Publish Date - 2021-07-10T21:49:28+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న తాజా నిర్ణయానికి అమెరికా చట్టసభల సభ్యులు, ఇండియన్ అమెరికన్‌లు తమ మద్దతు తెలిపారు. లాస్ ఏంజెల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టిని భారత్‌లో అమెరికా కొత్త రాయబారి

Joe Biden తాజా నిర్ణయాన్ని స్వాగతించిన భారత అమెరికన్లు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న తాజా నిర్ణయానికి అమెరికా చట్టసభల సభ్యులు, ఇండియన్ అమెరికన్‌లు తమ మద్దతు తెలిపారు. లాస్ ఏంజెల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టిని భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా నామినేట్ చేస్తూ జో బైడెన్ తీసకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. గొప్ప ఎంపికగా అభివర్ణించారు. యూఎస్ సెనేటర్ డ్యానీ ఫీన్‌స్టీన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘మేయర్ ఎరిక్ గార్సెట్టిని భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా నామినేట్ చేయడం అద్భతమైన నిర్ణయం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రతకు భారతదేశం ప్రముఖ్య భవిష్యత్తులో పెరుగుతుంది. ఆ దేశంతో సుస్థిరమైన సంబంధం కొనసాగించడం అవసరం’ అని అన్నారు. 



ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఎరిక్ గార్సెట్టిని బైడెన్ నామినేట్ చేయడం ద్వారా ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడేందుకు కీలక అడుగు పడిందన్నారు. ఇదిలా ఉంటే.. భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా అధ్యక్షుడు జో బైడెన్ తనను నామినేట్ చేయడంపట్ల ఎరిక్ గార్సెట్టి సంతోషం వ్యక్తం చేశారు. కాగా..ఎరిక్ 2013 నుంచి లాస్ ఏంజెల్స్ మేయర్‌గా, 12 ఏళ్లు సిటీ కౌన్సిల్ సభ్యుడిగా(ఇందులో 6 ఏళ్లు కౌన్సిల్ అధ్యక్షుడిగా) ఉన్నారు. 


Updated Date - 2021-07-10T21:49:28+05:30 IST